హెడ్డింగ్ చూస్తేనే గందరగోళానికి దారితీసే విధంగా ఉండొచ్చు. కానీ మేటర్ వేరే ఉంది. అల్లు అర్జున్ (Allu Arjun) .. సినిమా కోసం ఎంతైనా కష్టపడతాడు. తన వరకు బెస్ట్ ఇచ్చేస్తాడు. ‘నాకు సినిమా పోయినా పర్వాలేదు. కానీ అది చూడటానికి మాత్రం అందంగా ఉండాలి. అది పోయినా పర్వాలేదు’ అంటూ ఓ సందర్భంలో కూడా స్వయంగా అతనే చెప్పుకొచ్చాడు. మరి దానికి ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ కి లింక్ ఏంటి? అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు.
‘రేసు గుర్రం’ (Race Gurram) సినిమా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. సురేందర్ రెడ్డి (Surender Reddy) డైరెక్ట్ చేసిన ఆ సినిమా క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు, క్లైమాక్స్ ఇంకో ఎత్తు. ఎందుకంటే ‘రేసు గుర్రం’ క్లైమాక్స్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది. బ్రహ్మానందం (Brahmanandam) ఎంట్రీ ఇవ్వడం, బన్నీ ఫేక్ పోలీస్ గా ఎంట్రీ ఇవ్వడం.. ఆడియన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని పంచింది. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి అది కారణమైంది.
అయితే ‘రేసు గుర్రం’ క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కొంతమంది అల్లు అర్జున్..కి ‘ ‘రేసు గుర్రం’ క్లైమాక్స్ లో మీ పాత్రకి, బ్రహ్మానందం గారి పాత్రకి ప్రాముఖ్యత సమానంగా ఉంటుంది. మీ రోల్ కి సెపరేట్ హై అంటూ లేదు’ అని కొంతమంది చెప్పారట. దానికి అల్లు అర్జున్ ‘సినిమా బాగా వస్తుందా? అందరూ నవ్వుకుంటారా? అదే మనకి ముఖ్యం’ అంటూ చెప్పారట.
అల్లు అర్జున్..లానే ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) కూడా ‘ ‘ఆయ్’ (AAY) సినిమా కథ మీకు ఓకేనా? ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు’ అని అడిగితే.. ‘ఇతను కూడా సినిమా బాగుంటుంది కదా సార్, అందరూ నవ్వుకుంటారు కదా?’ అని నితిన్ చెప్పాడట. బన్నీ వాస్ (Bunny Vasu) నిన్న ‘ఆయ్’ ఈవెంట్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు.