పరిశ్రమలో హార్డ్ వర్కింగ్ హీరోలలో బన్నీ ఒకరు. తనకున్న మైనస్ పాయింట్స్ ని ప్లస్ పాయింట్స్ తో అధిగమించి స్టార్ హీరోగా ఎదిగారు. టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్న బన్నీ నెక్స్ట్ టార్గెట్ పాన్ ఇండియా ఇమేజ్ అని స్పష్టంగా అర్థం అవుతుంది. దీనికి కారణం ఆయన వరుసగా పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తున్నారు. అల వైకుంఠపురంలో మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న బన్నీ, సుకుమార్ తో చేస్తున్న మూవీని పాన్ ఇండియా చిత్రంగా ప్రకటించారు.
అల వైకుంఠపురంలో మూవీ 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రాలపై బన్నీకి నమ్మకం కుదిరింది. అందుకే తెలుగులో మాత్రమే విడుదల కావాల్సిన పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా మార్చారు. ఇక నిన్న కొరటాల శివతో తన 21వ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన బన్నీ, ఇది కూడా వివిధ భాషలో విడుదల కానున్నట్లు తెలియజేశారు. దీనితో అల్లు అర్జున్ నుండి రానున్న రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా చిత్రాలు అని అర్థం అవుతుంది.
కాబట్టి బన్నీ పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ పై కన్నేశాడని అర్థం అవుతుంది. ఇప్పటికే మూడు భారీ హిట్స్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పొజిషన్ పై బన్నీ కన్నేశాడు అనిపిస్తుంది. వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేసి బాలీవుడ్ లో ప్రభాస్ కి పోటీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రభాస్ కి ఆ పొజిషన్ అంత ఈజీగా దక్కలేదు. మరి బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకుకోవడం అంత ఈజీ కాదు. చూద్దాం బన్నీ ఎంత వరకు తన లక్ష్యం చేరుకుంటాడో.