2005 లో రజినీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం. హారర్ కామెడీ జోనర్ కు పునాది వేసింది ఈ చిత్రమే అనుకోవాలి. రజినీకాంత్, జ్యోతిక లు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే అందరికీ ఓ సర్ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ ఏడాదికి సౌత్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించింది ‘చంద్రముఖి’.
అయితే ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘నాగవల్లి’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, పూనమ్ కౌర్, శ్రద్దా దాస్, కమిలినీ ముఖర్జీ వంటి భామలు నటించారు. పి.వాసు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు. కానీ ఈ చిత్రం పెద్దగా మెప్పించలేదు. కానీ ఒరిజినల్ పై ఉన్న రెస్పెక్ట్ తో కలెక్షన్లు బాగా వచ్చాయి. అయితే మరోసారి ‘చంద్రముఖి 2’ అంటూ ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది.
పి.వాసు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించబోతున్నాడు. ‘లైకా’ వారు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.కీరవాణి సంగీత దర్శకుడు. అయితే ఆల్రెడీ ఈ చిత్రానికి సీక్వెల్ వచ్చింది కదా మళ్ళీ ‘చంద్రముఖి 2’ ఏంటి? అనే డౌట్ మీకు అందరికీ రావడం సహజమే. దీని పై ఆరా తీయగా ‘నాగవల్లి’ ని తమిళ్ రీమేక్ చేస్తున్నారు అనే వార్త అందింది.
‘నాగవల్లి’ లో బ్రహ్మానందం పోషించిన పాత్రని తమిళంలో వడివేలు పోషించనున్నాడన్న మాట.తెలుగులో ఈ చిత్రాన్ని డబ్ చేసే అవకాశం కూడా ఉందని వినికిడి.ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.