ప్లాన్ చేంజ్.. చరణ్ నెక్స్ట్ సినిమా వచ్చేది అప్పుడే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ కలయికలో వస్తున్న RC 15 ప్రాజెక్ట్ సంక్రాంతికి రాబోతున్నట్లు ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి నిర్మాత దిల్ రాజు అదే తరహాలో ప్లాన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. శంకర్ కూడా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్ కొనసాగించాడు. తప్పకుండా ఈ సినిమాను ప్లాన్ ప్రకారమే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే రీసెంట్ గా ఒక షెడ్యూల్ క్యాన్సల్ అయినట్లుగా తెలుస్తోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన షెడ్యుల్ ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు తదుపరి షెడ్యూల్ ను భోపాల్ లో పూర్తి చేయాలని అనుకున్నారు. అందుకోసం రామ్ చరణ్ ప్రత్యేకంగా వర్క్ షాప్ లో కూడా పాల్గొన్నాడు. అక్కడే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా షూట్ చేయాలని చిత్ర యూనిట్ ముందస్తు ప్రణాళికలు రచించింది. అయితే హఠాత్తుగా ఆ సినిమా షెడ్యూల్ ఇ ప్పుడు క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.

మళ్ళీ వచ్చే నెలలో షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. అయితే ఈ కారణంగా సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా కనిపించడం లేదు. సినిమాను ఎలాగైనా ఈ ఏడాది నవంబర్లో పూర్తిచేసే డిసెంబర్ సమయానికి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. అంతేకాకుండా జనవరిలో సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

కానీ ఈ షెడ్యూల్ వాయిదా పడటంతో సినిమాను మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో కొనసాగితే వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ సభ్యుల నుంచి ఒక క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Share.