యశస్వి కొండెపూడి.. ఈ సింగర్ అందరికీ సుపరిచితమే. ‘సరిగమప సింగింగ్’ షో టైటిల్ విన్నర్ గా నిలిచాడు. ‘జాను’ సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ అనే పాటను అద్భుతంగా పాడి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. దీంతో కొద్ది రోజులు ట్రెండింగ్ లో నిలిచాడు. అయితే ఇటీవల ఇతను ఓ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఫేమ్ కోసం ఇతను చీటింగ్ కు పాల్పడినట్టు సమాచారం.‘నవసేవ ఫౌండేషన్’ నిర్వహకురాలు ఫరా కౌసర్…
యశస్వి చీటింగ్ చేశాడని ఆరోపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మొన్నామధ్య ఓ షోలో పాల్గొన్న యశస్వి… అందులో ‘నేను ‘నవసేవ’ పేరుతో ఓ NGOను నడుపుతున్నాను, ఆ ఎన్జీవో ద్వారా సుమారు 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నాను’ అని చెప్పాడట. ఈ విషయాన్ని కౌసర్ తెలిపింది. యశస్వి చెప్పిందాంట్లో నిజం లేదని.. నేనే ఆ ఎన్జీవోని నడుపుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఆమె ఈ విషయంపై స్పందిస్తూ..
“నేను గత 5 ఏళ్ళుగా నవసేవ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలను చదివిస్తున్నాను. అయితే సింగింగ్ షోలో ఓట్లు రాబట్టుకోవడానికి నవసేవను తానే నడిపిస్తున్నట్టు యశస్వి చెప్పాడు. ఈ విషయం తెలిసి నేను అతడిని నిలదీశాను.. స్వయంగా కలిసి క్షమాపణలు చెప్పాలని కోరాను. కానీ అతను పట్టించుకోలేదు.
నేను చేస్తున్న సేవను అతడు చేస్తున్నట్లు ఎలా చెప్పుకుని పాపులర్ అవ్వాలని ప్రయత్నించాడు. ఈ విషయంపై తర్వలోనే యశస్విపై, టీవీ ఛానల్ పై, యాంకర్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాను.” అంటూ ఫరా కౌసర్ చెప్పుకొచ్చింది. మరి ఈ వివాదం పై యశస్వి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..!