టాలీవుడ్‌లో ఫ్లాప్‌లేని డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi), ప్రతీ సినిమా కధను రాసే విధానంలో ఒక సెంటిమెంట్ ఉంటుందని గతంలోనే ఒక క్లారిటీ ఇచ్చాడు. వైజాగ్ అంటే అనిల్‌కు ఎంతో ప్రత్యేకం. తన కెరీర్‌లో ఇప్పటివరకు వచ్చిన హిట్లన్నీ అక్కడే పుట్టాయట. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, తన నెక్ట్స్ సినిమాకు కూడా అదే లొకేషన్‌ను ఎంచుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం హిట్ తర్వాత అనిల్ తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) చేయబోతున్నాడు.
ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు ఆయన ఇప్పటికే వైజాగ్ వెళ్లిపోయాడు. పార్క్ హోటల్‌లో ఉంటూ కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. చిరంజీవికి ఫైనల్ నేరేషన్ ఇవ్వడానికి మరో మూడు లేదా నాలుగు వారాల సమయం తీసుకోనున్నాడట. అనిల్ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా పీక్స్‌లో ఉంటుందని అందరికీ తెలిసిందే.
వెంకటేష్ (Venkatesh) కోసం ఎఫ్2 (F2 Movie), బాలకృష్ణ (Nandamuri Balakrishna) కోసం భగవంత్ కేసరి (Bhagavanth Kesari) లాంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాలను తీసిన అనిల్, ఇప్పుడు మెగాస్టార్ టైమింగ్‌ను ఎలా వాడుకుంటాడో అన్న ఆసక్తి మెగా ఫ్యాన్స్‌లో నెలకొంది. చిరు కామెడీ టైమింగ్, ఆయన ఎనర్జీని ఎలా మలచనున్నాడన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తిగా అనిల్ స్టైల్లో ఉండనుందని, చిరు కెరీర్‌లో మరో మెమరబుల్ ఎంటర్టైనర్‌గా నిలిచేలా ప్లాన్ చేస్తున్నాడని టాక్. సంక్రాంతి 2026 టైంను టార్గెట్‌గా సినిమా షూటింగ్ జరగనుంది. మరి ఈ సెంటిమెంట్ ఈ సారి కూడా పని చేస్తుందా? అనిల్ మరో బ్లాక్‌బస్టర్ కొడతాడా అన్నది చూడాలి.