ఏ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ అయినా.. టీజర్ అయినా రిలీజ్ అయ్యింది అంటే సోషల్ మీడియాలో వాటి గురించి డిస్కషన్ ఎక్కువగానే జరుగుతుంది. ఒకవేళ ఆ టీజర్ లేదా గ్లింప్స్ కి సంబంధించిన సినిమాకి తమన్ సంగీత దర్శకుడు అయితే.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇంకా ఎక్కువగా అలెర్ట్ అయిపోతారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు తమన్ స్పెషలిస్ట్ అయినప్పటికీ… ఏదో ఒక సినిమాలో ట్యూన్ ను లేపేస్తాడు అని అంతా అంటుంటారు.
మరి నిజంగా తమన్.. కాపీ కొడతాడో? లేక ఇన్స్పిరేషన్ తీసుకుంటాడో తెలీదు కానీ… సోషల్ మీడియాలో డిస్కషన్స్ అయితే ఇలాగే నడుస్తాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మహేష్ బాబు- త్రివిక్రమ్ ల ‘గుంటూరు కారం’ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఇది మహేష్ అభిమానులను, మాస్ ఆడియన్స్ ను అలరించింది కానీ.. ఈ గ్లింప్స్ లో చాలా రిఫరెన్స్ లు కనిపించాయి.
‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘సిత్తరాల’ పాటలో అల్లు అర్జున్ కనిపించినట్టే అల్లు అర్జున్ కూడా కనిపించాడు. కానీ ఎవరి శైలి వారిది. అది పక్కన పెట్టేస్తే.. ‘గుంటూరు కారం’ కి ‘హైలీ ఇన్-ఫ్లేమబుల్’ అనే ట్యాగ్ లైన్ వాడటం జరిగింది. ఇది గతంలో వచ్చిన ‘రాఖీ’ సినిమాకి క్యాప్షన్ గా వాడారు. ఇక ‘గుంటూరు కారం’ గ్లింప్స్ కూడా చాలా వరకు కాపీ అనే ఆరోపణలు ఉన్నాయి.
‘రాఖీ’ సినిమాలో రంగు రబ్బా రబ్బా అనే పాటతో పాటు ఇటీవల వచ్చిన రామ్ – బోయపాటి ల మూవీ గ్లింప్స్ ట్యూన్ ను కూడా ‘గుంటూరు కారం’ (Guntur Karam) కోసం తమన్ కాపీ కొట్టినట్టు చెప్పుకుంటున్నారు. తమన్ ఇలాంటి ఆరోపణలు పట్టించుకోడు. ట్రోలింగ్ ను కూడా అతను లెక్కచేయడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది.