ముక్కాముల అప్పారావు, కోడూరు గోపాల కృష్ణ (Producer)
సిద్ధార్థ్ సదాశివుని, పవన్ (Music)
సతీష్ రాజ బోయిన (Cinematography)
Release Date : డిసెంబర్ 29, 2023
డిసెంబర్ చివరి వారం అలాగే 2023 కి కూడా చివరి వారానికి గాను ‘డెవిల్’ ‘బబుల్ గమ్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటి పక్కన మరో చిన్న సినిమా కూడా రిలీజ్ అయ్యింది. అదే ‘కరెన్సీ నగర్’. పెద్దగా చప్పుడు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అయితే సుదర్శన్, కేశవ వంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది. మరి సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :
కథ: ‘డబ్బు’ అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే కథ ఇది. సత్య (సుదర్శన్) కి అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు అవసరం పడతాయి. ఏకంగా రూ.5 లక్షలు అతనికి కావాల్సి వస్తుంది.తక్కువ టైంలో అవసరం రావడంతో అతను షార్ట్ కట్స్ వెతుకుతాడు. ఈ క్రమంలో దొంగతనం చేయడానికి కూడా రెడీ అవుతాడు.అలాంటి పరిస్థితుల్లో అతనికి కొంతమంది వల్ల ఓ చోట బంగారం ఉంది అని తెలుస్తుంది. దీంతో అతను వెంటనే అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ అతన్ని ఎవరో వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది. మనుషులు లేని ఆ చోట అతనికి ఓ గొంతు ద్వారా 3 కథలు వినపడతాయి. అవి ఏంటి? చివరికి సత్య అక్కడి నుండి క్షేమంగా బయటపడ్డాడా? అసలు సత్యకి రూ.5 లక్షల అవసరం ఎందుకు వచ్చింది? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు: ఇందులో మెయిన్ లీడ్స్ అని కచ్చితంగా ఒకరి గురించి చెప్పలేం. కథ ప్రకారమే పాత్రలు అన్నీ కీలకంగా ఉంటాయి. సత్య పాత్ర పోషించిన సుదర్శన్ పాత్ర అతి కీలకమైనది అని చెప్పొచ్చు. ఇక యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్ వంటి వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. తమ పాత్రలకి తగ్గట్టు వారు చాలా సహజంగా నటించారు అని చెప్పాలి.
సాంకేతిక నిపుణుల పనితీరు: డబ్బు నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ‘మనీ’ ‘మనీ మనీ’ నుండి ‘ఎఫ్ 2’ వరకు చాలా సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. వీటన్నిటిలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా ఉంటాయి. ఈ ‘కరెన్సీ నగర్’ లో కూడా ఆ సినిమాలంత కాదు కానీ.. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. దర్శకుడు వెన్నెల కుమార్ పోతేపల్లి కథని నడిపించిన తీరు బాగానే ఉంది.
నిర్మాతలు ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ ఖర్చుకి వెనకాడకుండా ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను నిర్మించారు అని ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. సిద్ధార్థ్ సదాశివుని, పవన్..ల మ్యూజిక్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి.సతీష్ రాజ బోయిన కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంటుంది. రన్ టైం కూడా 2 గంటల 6 నిమిషాలే ఉండటం ఇంకా ప్లస్ పాయింట్ గా చెప్పాలి.
విశ్లేషణ: కరెన్సీ నగర్… ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్క్రీన్ ప్లేని ఇష్టపడేవారు ఈ వీకెండ్ కి కరెన్సీ నగర్ ని ట్రై చేయొచ్చు.
రేటింగ్ : 2.25/5
Rating
2.26
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus