తెలుగులో కూడా ‘బిగ్ బాస్’ రియాలిటీ షో చాలా పాపులర్ అయ్యింది. నార్త్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్.. సౌత్ లో కూడా సత్తా చాటుతుంది. మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో కూడా ఈ రియాలిటీ షో సక్సెస్ అయ్యింది. తెలుగులో మరింతగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మొదటి సీజన్ నే ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో హోస్ట్ చెయ్యడం వల్ల అనుకుంట… ఈ షోకి ఆదరణ బాగా పెరిగింది. ఇక రెండో సీజన్ ను నాని కూడా అదే స్థాయిలో సక్సెస్ అయ్యేలా చేసాడు.
ఇక బిగ్ బాస్ మూడో సీజన్ ను హోస్ట్ చేసిన నాగార్జున అయితే.. మరింత కళ తెప్పించాడనే చెప్పాలి. అందుకే నాలుగో సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడట. ఇక కంటెస్టెంట్ ల విషయంలో రక రకాల పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. ఈ సారి తక్కువ మంది కంటెస్టెంట్లే పాల్గొంటారని సమాచారం. షో మొదలయ్యే 3 రోజుల ముందు మాత్రమే మొత్తం కంటెస్టెంట్ ల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ‘బిగ్ బాస్4’ మొదలయ్యే రోజునే కంటెస్టెంట్ ల పేర్లను రివీల్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇక ఆగష్ట్ 1 లేదా 8 వ తారీఖు నుండీ ‘బిగ్ బాస్4’ మొదలు కానుందని సమాచారం. అయితే ఈ సీజన్ ను 50 రోజులు మాత్రమే కండక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.