భారీ బడ్జెట్ సినిమాలకు ఫస్టాఫ్ తో పోల్చి చూస్తే సెకండాఫ్ అద్భుతంగా ఉండటం కీలకం అనే సంగతి తెలిసిందే. అయితే దేవర (Devara) సినిమాలో ఫస్టాఫ్ వావ్ అనేలా ఉండగా సెకండాఫ్ విషయంలో మాత్రం స్క్రీన్ ప్లేకు సంబంధించి కొరటాల శివ (Koratala Siva) తడబడ్డారు. సలార్ (Salaar) , కల్కి (Kalki 2898 AD) సినిమాల క్లైమాక్స్ ప్రేక్షకుల్లో ఒకింత దేవర క్లైమాక్స్ లేదని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవరలో చిన్నచిన్న తప్పులు జరిగాయని ఫ్యాన్స్ సైతం అంగీకరిస్తున్నారు.
Devara
అయితే దేవర ఫైనల్ రిజల్ట్ మండే కలెక్షన్లతో తేలిపోనుంది. మండే కలెక్షన్లు అద్భుతంగా ఉంటే దేవర హిట్ అని ఫిక్స్ అయిపోవచ్చు. మండే కలెక్షన్ల ఆధారంగా దేవర దసరా సెలవులను ఏ రేంజ్ లో క్యాష్ చేసుకుంటుందో కూడా ఒక అంచనాకు రావచ్చు. దేవర మూవీ తుది ఫలితాన్ని మండే కలెక్షన్లు డిసైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
దేవర సినిమాకు బెనిఫిట్ షోలు ప్రదర్శితం కావడం ఈ సినిమాకు ఎంతో ప్లస్ అయింది. బెనిఫిట్ షో టికెట్లు 1000 నుంచి 1500 రూపాయలకు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నా ఇంటర్వెల్ ఫైట్ సీన్ రేంజ్ లో ఇతర సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పవచ్చు. దేవర మిక్స్డ్ టాక్ పై కొరటాల శివ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.
దేవర1 సినిమా సెకండాఫ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే దేవర సినిమాకు మరింత ప్లస్ అయ్యేది. ఓవర్సీస్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడం దేవరకు ప్లస్ అయింది. దేవర సినిమాకు సక్సెస్ మీట్ నిర్వహించడం వల్ల మేలు జరిగిందని చెప్పవచ్చు. దేవర టార్గెట్ మరీ పెద్దది కాకపోవడం ఈ సినిమాకు బెనిఫిట్ కానుందని చెప్పవచ్చు.