యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) దేవర (Devara) రిలీజ్ కు ముందే సంచలన రికార్డులతో వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో 4000కు పైగా బెనిఫిట్ షోలు ప్రదర్శితం అవుతుండగా దాదాపుగా అన్ని షోలకు సోల్డ్ ఔట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయని సమాచారం అందుతోంది. ఏపీలో గత కొన్నేళ్లుగా బెనిఫిట్ షోలకు అనుమతులు లేవు. అయితే ఏపీలో కూటమి అధికారంలో ఉండటంతో దేవర బెనిఫిట్ షోలకు అనుమతులు లభించాయి.
Devara
అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో దేవర ఖాతాలో రికార్డ్ చేరింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో ఎక్కువ సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలు ప్రదర్శితమవుతున్న సినిమా కూడా దేవర కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలో దేవర మూవీ 13 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతుండగా న్యూజిల్యాండ్ లో 3 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజవుతోంది. దేవర సినిమాలో సెకండాఫ్ లోని చివరి 40 నిమిషాలు హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది.
బాహుబలిని (Baahubali) పోలిన క్లైమాక్స్ అంటూ రత్నవేలు చేసిన కామెంట్ల నేపథ్యంలో దేవర క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటనే చర్చ సైతం జరుగుతోంది. దేవర నిడివి గురించి ఒకింత గందరగోళం నెలకొనగా 2 గంటల 52 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఈ సినిమాకు అనుమతులు లభించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
దేవర సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు అనుమతులు లభించాయి. రాయలసీమలో ఉదయం 4 : 30 గంటల నుంచి దేవర షోలు ప్రదర్శితం అవుతున్నాయి. అర్దరాత్రి సమయంలో సినిమాను ప్రదర్శించడం రిస్క్ అని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అనంతపురంలో ఉదయం 8 గంటల నుంచి దేవర షోలు ప్రదర్శితం కానుండటం కొసమెరుపు.