ప్రేమకథలకు, కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) . ఇప్పడంటే సెలక్ట్‌డ్ సినిమాలు చేస్తూ (వస్తూ) వెళ్తున్నారు. రీసెంట్‌గా ‘పుష్ప: ది రూల్’తో (Pushpa 2: The Rule) భారీ విజయం అందుకున్నారు. ఈ రోజు ‘తండేల్’ (Thandel) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలో ‘కుబేర’ (Kubera) అనే సినిమాతో రాబోతున్నారు. ఇలా రకరకాల జోనర్లలో సినిమాలు చేస్తున్నారు. అలా ఆయన ఇప్పటివరకు 25 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కెరీర్ గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడారు.
కెరీర్ గురించి చెబుతారా అని అడిగితే.. మనం ముందుకు సాగిపోతూ ఉండాలంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలి. ఒకవేళ వెనక్కి తిరిగి చూడాలంటే ఆ ప్రయాణాన్ని చూసి గర్వపడకూడదు. యంగ్ ఏజ్‌లోనే పరిశ్రమలోకి రావడం వల్లే ఇంత లాంగ్ జర్నీ అవకాశం దక్కింది అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. మ్యూజిక్ వింటూనే పెరిగానని, కెరీర్‌లో ఇన్ని రకాల జానర్‌లు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు.
లైవ్ షోస్ చేయడం తనక కెరీర్‌కు ప్లస్ అయిందని చెప్పిన డీఎస్పీ ఆ షోస్ వల్ల వెయ్యి ఏనుగుల బలం వచ్చిందన్నారు. ఇంకా అద్భుతమైన సంగీతం అందించాలనే స్ఫూర్తి కలిగింది అని కూడా చెప్పారు. తనను ఇన్నాళ్లుగా ప్రోత్సహిస్తున్న అభిమానులు కూడా తన కెరీర్ గ్రోత్‌కి కారణం అని చెప్పారు. ఇన్నేళ్ల కెరీర్ ఎలా సాధ్యం అని అడుగుతుంటారని.. దానికి కారణం చేసే చిత్రాన్నీ తొలి సినిమా అనుకుని పని చేయడమే అని చెప్పారాయన.
ఆ ఫ్రెష్‌నెస్ ఫీలింగే తనను ముందుకు నడిపిస్తోందని చెప్పారు. మనలోని కొత్తదనాన్ని మనమే ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటూ వెళ్లాలని, కొత్త సౌండింగ్‌ను ఎప్పటికిప్పుడు పట్టుకోవాలని చెప్పారు. అయితే సౌండింగ్ ఎలా ఉన్నా.. అందులోని ఎమోషన్ మిస్సవకూడదు అని చెప్పారు. అది మిస్ అయితే ఎంత కొత్త ట్యూన్ ఇచ్చినా ప్రేక్షకులకు నచ్చదు అని చెప్పారు.