లాక్డౌన్ కారణంగా ఎక్కువ నష్టపోతున్న నిర్మాతలలో దిల్ రాజు మొదటిస్థానంలో ఉన్నారు. ఆయన నిర్మాణంలో ఈ ఏడాది విడుదలైన జాను షాక్ ఇవ్వగా… రెండు సినిమాలు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. నాని, సుధీర్ హీరోలుగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ వి మూవీ గత నెలలో ఉగాది కానుకగా విడుదల కావాల్సింది. ఇక పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో మేలో విడుదల చేయాలని భావించారు.
ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీనితో దిల్ రాజు తీవ్ర అసహనంలో ఉన్నారని తెలుస్తుంది. అలాగే పవన్ వకీల్ సాబ్ కమర్షియల్ గా ఎంత వరకు ఆడుతుందనే దిగులు కూడా ఆయన్ని పట్టి వేదిస్తుందట. దిల్ రాజు పవన్ తో కమర్షియల్ మూవీ చేయాలని భావించిననా పవన్ పొలిటికల్ కారణాలు చూపి పింక్ రీమేక్ చేద్దాం అని చెప్పారు. దీనితో దిల్ రాజు ఆ చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకొని వేణు శ్రీరాంతో స్క్రిప్ట్ సిద్ధం చేయించారు.
ఆ తరువాత పవన్ కళ్యాణ్ మరో రెండు చిత్రాలు ప్రకటించారు. దర్శకుడు క్రిష్ తో విరూపాక్ష అనే పీరియాడిక్ మూవీ చేస్తుండగా షూటింగ్ జరుపుకుంటుంది, ఇక హరీష్ శంకర్ తో మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఐతే ఈ రెండు చిత్రాలు కమర్షియల్ మూవీస్ కావడం విశేషం. అప్పుడే పవన్ కమర్షియల్ సినిమాకు ఒప్పుకుంటే దిల్ రాజు కూడా కమర్షియల్ సినిమా చేసేవాడు. ఇప్పుడు ఇదే అసహనంతో దిల్ రాజు పవన్ పట్ల ఉన్నాడని వినికిడి.