Anil Ravipudi: వెంకటేష్ 76 మూవీకి అనిల్ పారితోషికం ఎంతో తెలుసా?
- October 26, 2024 / 11:29 AM ISTByFilmy Focus
టాలీవుడ్లో అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) . కమర్షియల్ సినిమాలని, కామెడీ సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా తీయడం ఈయన స్పెషాలిటీ. అనిల్ రావిపూడి టాలీవుడ్ రోహిత్ శెట్టి (Rohit Shetty) అంటూ చాలా మంది ప్రశంసిస్తూ ఉంటారు. టికెట్ కి పెట్టిన డబ్బులకి న్యాయం చేసేలా అనిల్ రావిపూడి సినిమాలు ఉంటాయి. అందువల్లే అతనికి డిమాండ్ బాగా ఎక్కువ. ప్రస్తుతం అతను విక్టరీ వెంకటేష్ తో (Venkatesh) ఓ సినిమా చేస్తున్నాడు.
Anil Ravipudi

మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) , ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)..లు హీరోయిన్లు. దిల్ రాజు (Dil Raju) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కూడా సంక్రాంతికే విడుదల అవుతుంది కాబట్టి.. అనిల్- వెంకటేష్..ల సినిమా రిలీజ్ అనుమానంగా ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ సినిమా కోసం హీరో వెంకటేష్ కంటే కూడా దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్కువ పారితోషికం అందుకుంటున్నారట.

అవును.. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి గాను వెంకటేష్ రూ.18 కోట్లు పారితోషికం అందుకుంటున్నారట. అయితే అనిల్ రావిపూడి రూ.25 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్టు సమాచారం. అంతేకాదు.. ఈ సినిమా బిజినెస్, వచ్చే లాభాల్లో అనిల్ రావిపూడికి వాటా ఉంటుందట. వెంకటేష్ కి కూడా వాటా ఉంటుందట. అలా చూసుకున్నప్పటికీ అనిల్ రావిపూడి పారితోషికం రూ.30 కోట్ల వరకు వెళ్తుంది. వెంకటేష్ పారితోషికం రూ.22 కోట్లు – రూ.23 కోట్లు మధ్యలో ఉంటుందని అంచనా.

















