Jr NTR: ఆ సాహసం చేయగలిగేది ఎన్టీఆర్ మాత్రమే!
- May 19, 2022 / 11:01 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా ఎన్టీఆర్ ఎంతో అవలీలగా నటిస్తారు. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి ఎంతో మంది దర్శకులు ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి నవరసాలు పలికించగల అతి కొద్దిమంది నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ నటించిన RRR సినిమాలోని కొమరం భీముడో పాటలో ఈయన పలికించిన హావభావాలకు ఎంతోమంది ఫిదా అయ్యారు.

సాక్షాత్తు కళాతపస్వి విశ్వనాథ్ వంటి వారే ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపించారు. ఇలా ఎంతో మంది దర్శకుల చేత ప్రశంసలు అందుకున్న ఎన్టీఆర్ పై దర్శకుడు కన్మణి ప్రశంసల వర్షం కురిపించారు.ఈయన పలు తెలుగు తమిళ సినిమాలకు దర్శకుడిగా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న హీరోలలో తనకు ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టమని తెలిపారు. లెజండ్రీ నటుడు కమల్ హాసన్ తర్వాత ఆయన తరహాలో హావభావాలను తెలియజేస్తూ నటించే సత్తా ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని ఆయన ఎన్టీఆర్ పై పొగడ్తలు కురిపించారు.

కమల్ హాసన్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఎవరికి సాధ్యపడని ఒక ప్రతిభ దాగి ఉంది అంటూ ఆయన వెల్లడించారు. సాధారణంగా ఏ హీరోలు అయినా ఏడ్చే సన్నివేశాలను క్లోజ్ షాట్ లో తీసినప్పుడు ఆ సన్నివేశంలో సహజత్వం ఉండదు. కానీ ఎన్టీఆర్ కమల్ హాసన్ ఇద్దరు కూడా క్లోజప్ షాట్ లో ఏడ్చే సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయని, ఆ నటనలో సహజత్వం ఉంటుందని తెలిపారు. కమల్ హాసన్ తర్వాత అలా సాహసం చేయగల నటుడు కేవలం ఎన్టీఆర్ మాత్రమేనని, అది కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు.
సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!
















