చై – సామ్ విడిపోతారని అప్పుడే అనుకున్నా.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ కపుల్ గా ఉన్నటువంటి చైతన్య సమంత జంటగా విడిపోయి విడాకులు తీసుకున్న వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని అభిమానులు సమంతను పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, సమంత అందుకు తగ్గ సమాధానం చెబుతూ నిత్యం నాగచైతన్య సమంత సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే విడాకుల తర్వాత సమంత కాస్త గ్లామర్ చేయడంతో అక్కినేని అభిమానులు సమంత పై దారుణమైన కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

తాజాగా ఒక నెటిజన్ ఏకంగా సమంతను వేశ్య అంటూ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. అదేవిధంగా నాగచైతన్య నటి శోభితా ధూళిపాళతో డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు రావడంతో చైతన్య అభిమానులు ఈ విషయంపై సమంతను టార్గెట్ చేశారు. సమంత నాగచైతన్య పై ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు.ఇక ఈ విషయంపై స్పందించి సమంత సరైన సమాధానం చెప్పారు. ఒక అమ్మాయి గురించి ఇలాంటి వార్తలు వస్తే కరెక్ట్ అదే అబ్బాయి గురించి వస్తే అమ్మాయి చేయించింది అంటూ భావిస్తారు.

ఇప్పటికైనా మేల్కొండి అంటూ స్పందించారు. అయితే సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ గీతాకృష్ణ షాకింగ్ కామెంట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగచైతన్య సమంత ఇద్దరికీ చాలా కెరియర్ ఉంది. ఈ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడే విడిపోతారని అనుకున్నాను అంటూ కామెంట్ చేశారు. సమంత ఎంతో ఫ్రీడమ్ ఉన్న అమ్మాయి తన పెళ్లి చేసుకుని ఒక సాధారణ గృహిణిగా ఇంటిపట్టునే ఉండాలంటే కుదరదు.

అలాగని సినిమాలలో నటించడం మన సౌత్ ప్రేక్షకులకు నచ్చదు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు ఇలాంటివన్నీ కామన్. అయితే ఇలా గ్లామర్ షో చేయడం సౌత్ ప్రేక్షకులకు నచ్చదు. ఇక నాగచైతన్య గురించి మాట్లాడితే విడాకులు తీసుకున్న తరువాత ఆయన మరొకరితో డేటింగ్ చేస్తే తప్పేంటి?కానీ తిరిగి సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న అమ్మాయితో డేటింగ్ చేస్తే పరిస్థితి ఏంటి అనే విషయం గురించి నాగచైతన్య ఆలోచించుకుంటే మంచిది అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.