Mohan Raja, Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ గురించి దర్శకుడు మోహన్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ ను తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు. ఈయన రీమేక్ చిత్రాలకి స్పెషలిస్ట్.ఎన్నో సూపర్ చిత్రాలకి ఎడిటర్ గా వర్క్ చేసి ‘ఎడిటర్’ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి.చిరంజీవి గారితో ఎడిటర్ మోహన్ గారు నిర్మించిన సూపర్ హిట్ మూవీ ‘హిట్లర్’ కి కూడా మోహన్ రాజా పనిచేసారు.

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ధృవ’ చిత్రం ఒరిజినల్ ‘తనీ ఒరువన్’ ను తెరకెక్కించింది మోహన్ రాజానే..! అంతేకాదు 20 ఏళ్ళ క్రితం… జగపతి బాబు- అర్జున్-వేణు కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘హనుమాన్ జంక్షన్’ ను తెరకెక్కించింది కూడా ఈయనే..! 20 ఏళ్ళ తర్వాత మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ చిత్రంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చారు మోహన్ రాజా. ఆయన మాట్లాడుతూ.. ” ‘హిట్లర్’ సినిమా టైంకి నాకు 22ఏళ్ళ వయసు.

‘గ్యాంగ్ లీడర్’ సినిమా టైం నుండీ నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. ‘హిట్లర్’ సినిమాకి ఓ నిర్మాత కొడుకుగా నేను చిరంజీవి గారికి దగ్గరగా పనిచేసే అవకాశం దక్కింది.హిట్లర్ ఒరిజినల్ వెర్షన్…చిరంజీవి గారు మలయాళంలో చూస్తున్నప్పుడు నేను ఆయన పక్కనే ఉన్నాను. ఆయనకి అర్ధం కానీ సీన్లు వచ్చినప్పుడు నేను ఆయనకి తెలుగులో అనువదించాను. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. అది కూడా నా డైరెక్షన్లో ఆయన సినిమా చేయడం అంటే నాకు కల లా అనిపిస్తుంది. ‘లూసిఫర్’ ను మెగాస్టార్ ఇమేజ్ కు తగినట్టు చాలా మార్పులు చేసాం.

ఆయనతో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను కట్ చెప్పడం కూడా మర్చిపోయి అలా చూస్తూనే ఉంటాను. 45 రోజులు షూటింగ్ ఫినిష్ అయ్యింది.జనవరి నాటికి చిత్రీకరణ చాలా వరకు పూర్తయిపోతుంది. 2 ఫైట్లు చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రంలో చిరంజీవి గారి పాత్ర చాలా కూల్ గా సెటిల్డ్ గా అలాగే అందరినీ గ్రిప్ లో పెట్టుకునే ఓ లీడర్ గా కనిపిస్తారు. మలయాళం చూసిన వాళ్లకి కూడా ఇది బాగా నచ్చుతుంది. అభిమానులు ఎంతైనా ఆశించొచ్చు. మీ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు మోహన్ రాజా.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!


83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Share.