సుహాస్ (Suhas) హీరోగా తెరకెక్కిన ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 12న విడుదల కాబోతుంది. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ (Dil Raju) బ్యానర్ పై హర్షిత్ రెడ్డి (Harshith Reddy) , హన్షిత రెడ్డి (Hanshitha Reddy)..లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల (Sandeep Reddy Bandla) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈరోజు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి (Sandeep Reddy Bandla) . అవి మీకోసం :
Sandeep Reddy Bandla Interview
ప్ర) ‘జనక అయితే గనక’ ఐడియా ఎలా వచ్చింది?
సందీప్ : మా ఫ్యామిలీ నేను ఆఖరి సంతానం. మా అమ్మ నాన్న..లకి చాలా ఏళ్ళ తర్వాత పుట్టాను. నాలానే బయట ఫ్యామిలీస్లో.. కూడా ఇలా జరుగుతుంటుంది అని తర్వాత తెలిసింది. సో చిన్నప్పటి నుండి చూసిన పరిస్థితులు వంటివి ఆధారం చేసుకుని కాలానికి తగినట్టు ఈ కథ రాసుకున్నాను.
ప్ర) ఇలాంటి కాన్సెప్ట్..లతో ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల స్ఫూర్తి కూడా ఉందా?
సందీప్ : బాలీవుడ్లో ‘విక్కీ డోనర్’ ‘బదాయ్ హో’ (Badhaai Ho) వంటి సినిమాలు వచ్చాయి. ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) .. ఇలాంటి కథలతో సినిమాలు చేశారు. కానీ ‘జనక అయితే గనక’ పూర్తిగా మన నేటివిటీని దృష్టిలో పెట్టుకునే తీసిన సినిమా.
ప్ర) ‘విక్కీ డోనర్’ వంటి సినిమాలు తెలుగులో రీమేక్ చేసినా అవి ఇక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు.. మరి ఈ సినిమా విషయంలో మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది?
సందీప్ : కోవిడ్..కి ముందు ఆడియన్స్ టేస్ట్ వేరుగా ఉండేది. కానీ కోవిడ్ టైంలో బాగా అప్డేట్ అయ్యారు. అన్ని భాషల్లోని సినిమాలు చూసి.. కొత్త కంటెంట్ ఎక్కువగా కోరుకుంటున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ తో తీసిన సినిమానే ఇది.
మా (Sandeep Reddy Bandla) గురువు గారు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) గారు కూడా తెలుగు ప్రేక్షకుల గురించి చాలా గొప్పగా చెబుతుంటారు. ‘కొత్త ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నట్టు ఎక్కడా రిసీవ్ చేసుకోరు’ అని..!
ప్ర) దిల్ రాజు గారి బ్యానర్లో ఈ సినిమా చేయడం ఎలా అనిపించింది..?
సందీప్ : దిల్ రాజు గారు కథ విన్న రోజు నుండి ఇప్పటివరకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన ఇన్పుట్స్ బాగా హెల్ప్ అయ్యాయి. ఎక్కడా రాజీ పడకుండా హర్షిత్, హన్షిత..లు సినిమాను నిర్మించారు. నా మొదటి సినిమాని ఇలాంటి బ్యానర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది.
ప్ర) సంగీత దర్శకుడు విజయ్ బుల్గానున్ .. గారితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది?
సందీప్ : చాలా మంచి పాటలు ఇచ్చారు. ‘నా ఫేవరెట్ నా పెళ్ళామే’ అనే పాట బాగా వైరల్ అవుతుంది. అన్నీ మంచి పాటలు ఇచ్చారు.
సందీప్ : ముందుగా కొంతమంది హీరోయిన్లని అనుకున్నాను. కానీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసినప్పుడు ఈమె పర్ఫెక్ట్ అనిపించింది.
ప్ర) సుహాస్ కంటే ముందుగా ఈ కథని నాగ చైతన్యకి వినిపించారట.. నిజమేనా?
సందీప్ : నిజమే..! ఈ కథ ముందుగా నాగ చైతన్య (Naga Chaitanya) గారికి చెప్పాను. ఆయనకు కథ నచ్చింది. కానీ ఆయన శేఖర్ కమ్ముల (Sekhar Kammula) గారి ‘లవ్ స్టోరీ’ (Love Story) సినిమాతో బిజీగా ఉండటం వల్ల.. తర్వాత సుహాస్ కి వినిపించడం. అతను వెంటనే ఎక్సయిట్ అయ్యి ఓకే చెప్పడం జరిగింది.
ప్ర)’కండో*’ అనే సెన్సిటివ్ టాపిక్ చుట్టూ అల్లిన కథ కాబట్టి.. సెన్సార్ సమస్యలు ఏమైనా వచ్చాయా?
సందీప్ : అలాంటివి ఏమీ రాలేదు అండీ. ఇది 2 జెనరేషన్లు కలిసి చూడదగ్గ సినిమా. సెన్సార్ వాళ్ళు చూసి హ్యాపీగా నవ్వుకుని యు/ఎ ఇచ్చారు.
ప్ర) ఈ కథ ఫాదర్స్ సైడ్ మాత్రమే ఆలోచించి తీసిందా? లేక మదర్స్ సైడ్ కూడా ఆలోచించేలా ఉంటుందా?
సందీప్ : కచ్చితంగా మదర్స్ సైడ్ కూడా ఆలోచించి తీసినదే. స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఉంటుంది. సాధారణంగా పిల్లలు పుడితే హాస్పిటల్ బెడ్ పై ఉన్న తల్లి బాధని పట్టించుకోకుండా.. అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఫోన్లు చేసి బిడ్డ పుట్టిన విషయాన్ని చెప్పుకుని సంబరపడుతుంటారు. ఆ యాంగిల్లో కూడా ఆలోచించి సీన్స్ రాశాను.
ప్ర) ప్రీమియర్స్ రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది..?
సందీప్ : చాలా బాగుంది. చాలా సంతోషంగా అనిపించింది. ‘రెండున్నర గంటల పాటు హ్యాపీగా నవ్వుకున్నామని.. ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయినట్టు’ అంతా చెప్పారు.