మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) , శ్రీను వైట్ల (Srinu Vaitla) కాంబినేషన్లో ‘నీకోసం’ ‘వెంకీ’ (Venky) ‘దుబాయ్ శీను’ (Dubai Seenu) ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (Amar Akbar Anthony) వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో ‘వెంకీ’ సినిమాకి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. 2004 వ సంవత్సరం మార్చి 26 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇదే సినిమాని.. 2023 చివర్లో అంటే డిసెంబర్ 30 న ఈ సినిమాని రీ రిలీజ్ చేయగా.. చాలా మంది ప్రేక్షకులు ఎగబడి చూశారు.
అంతలా ఈ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పాలి. శ్రీను వైట్ల డైరెక్షన్ కోన వెంకట్, గోపీమోహన్ ..ల సంభాషణలు, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్, రవితేజ- స్నేహ (Sneha) ..ల కెమిస్ట్రీ, బ్రహ్మానందం(Brahmanandam Kanneganti) -ధర్మవరపు సుబ్రహ్మణ్యం (Dharmavarapu Subramanyam)- ఏ.వి.ఎస్ (AVS) , కృష్ణ భగవాన్ (Krishna Bhagavan) ..ల కామెడీ,.. కలగలిపి ‘వెంకీ’ ని రిపీటెడ్ గా ప్రేక్షకులు చూసేలా చేశాయి అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.. సరిగ్గా చూసుకుంటే ‘వెంకీ’ సినిమా స్టైల్లోనే ‘దుబాయ్ శీను’ ని కూడా రూపొందించాడు దర్శకుడు శ్రీను వైట్ల.
ఆ సినిమాలో కూడా కామెడీ బాగానే ఉంటుంది కానీ ‘వెంకీ’ రేంజ్లో కాదు. ‘దుబాయ్ శీను’ కూడా బాగానే ఆడింది కానీ ‘వెంకీ’ రేంజ్లో కాదు. ‘దుబాయ్ శీను’ లో కూడా హీరో అండ్ గ్యాంగ్ సేమ్ ఉంటుంది. అయితే ఇప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల ‘వెంకీ 2 ‘ చేయడానికి రెడీ అవుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇది ‘వెంకీ’ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషించే వార్త అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీను వైట్ల ఫామ్లో లేడు.’బాద్ షా’ (Baadshah) తర్వాత అతను సినిమాలు అన్నీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి.
ఇలాంటి టైంలో ‘వెంకీ 2 ‘ చేసి ‘వెంకీ’ కల్ట్ ఫ్యాన్స్ ని హర్ట్ చేయడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.’శ్రీను వైట్ల అనుకుంటే సరిపోతుందా రవితేజ కూడా ‘వెంకీ 2 ‘ కి ఓకే చెప్పాలిగా..! ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ దెబ్బకి అతను మళ్ళీ శ్రీను వైట్లని నమ్మే అవకాశం అయితే ఉండకపోవచ్చు’ అనే కామెంట్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి.