రచయిత వక్కంతం వంశీ అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ నమ్మకంతోనే అల్లు అర్జున్ అతనికి డైరక్టర్ గా అవకాశమిచ్చారు. వీరి కలయికలో తెరకెక్కిన నా పేరు సూర్య మూవీ గతవారం రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. యాక్షన్ సన్నివేశాలను వంశీ అద్భుతంగా చిత్రీకరించారు. అయితే కొన్ని చోట్ల లాజిక్ లు మిస్ అయ్యారు. నా పేరు సూర్య చిత్రంలో చిన్నప్పుడే బన్నీ ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. అలా తల్లికి దూరమైన అతను, తండ్రి సంతకం కోసం మళ్లీ ఇంటికొస్తాడు. కానీ అతడిని తల్లి గుర్తుపట్టదు. సరిగ్గా ఇక్కడే వక్కంతం దొరికిపోయారు.
పెరిగి పెద్దయిన బన్నీని తల్లి గుర్తుపట్టలేదని అనుకుందాం… కానీ చిన్నప్పట్నుంచి కనుబొమ్మ మీద ఉన్న గాటు చూసైనా గుర్తుపట్టాలి కదా?. కనీసం ఇతడు తన కొడుకులా ఉన్నాడని అనుమానించాలి కదా… ఈ చిన్న విషయాలను వక్కంతం వంశీ లైట్ తీసుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇవే ప్రశ్నలు తలెత్తుతాయి. ఒక ప్రేక్షకుడు అయితే నేరుగా డైరక్టర్ నే ప్రశించారంట. ఈ విషయాన్నీ స్వయంగా డైరక్టర్ చెప్పారు. “ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఈ లాజిక్ గురించి ప్రశ్నించారు. నాకు చెప్పుతో కొట్టినట్టయింది. ఇక నుంచి ఇలాంటి చిన్న చిన్న లాజిక్కులు మిస్ అవ్వకుండా జాగ్రత్తపడతాను. ఈసారికి క్షమించండి” అని అందరినీ కోరారు.