సీనియర్ దర్శకులు కె.విజయ భాస్కర్ (K. Vijaya Bhaskar) అందరికీ సుపరిచితమే. ‘స్వయంవరం’ ‘నువ్వేకావాలి’ ‘నువ్వు నాకు నచ్చావ్’(Nuvvu Naaku Nachav) ‘మన్మథుడు’ ‘మల్లీశ్వరి’ (Malliswari) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమాలన్నిటికీ త్రివిక్రమ్ (Trivikram) రైటర్ గా పనిచేశారు. విజయ్ భాస్కర్ డైరెక్షన్ కి త్రివిక్రమ్ రచన.. చాలా అందంగా ఉండేది. పైన చెప్పుకున్న సినిమాలు రిపీటెడ్ గా ప్రేక్షకులు చూస్తున్నారు అంటే అదే ముఖ్య కారణం. కానీ ఎందుకో వీళ్ళు సెపరేట్ అయిపోయారు.
త్రివిక్రమ్.. డైరెక్షన్ ట్రయిల్స్ చేసి సక్సెస్ అయ్యారు.2002 లో ‘నువ్వే నువ్వే’ తో ఆయన డైరెక్టర్ గా మారినప్పటికీ.. 2004 లో విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘మల్లీశ్వరి’ కి కూడా త్రివిక్రమ్ గా రైటర్ గా పని చేయడం జరిగింది. కానీ ఆ సినిమా టైంలో వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు టాక్ నడిచింది. 2005 లో వచ్చిన ‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva) సినిమాకి చిరు (Chiranjeevi) పట్టుబట్టడంతో త్రివిక్రమ్ ఇబ్బంది పడుతూనే పనిచేసినట్టు చర్చలు జరిగాయి.
ఆ తర్వాత విజయ్ భాస్కర్ – త్రివిక్రమ్ పూర్తిగా సెపరేట్ అయిపోయారు. త్రివిక్రమ్ లేకపోవడంతో విజయ్ భాస్కర్ గ్రాఫ్ కూడా పడిపోయినట్టు అయ్యింది. తర్వాత జనాలు కూడా వీరి మధ్య ఏం జరిగింది అనే విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ భాస్కర్ ఈ విషయం పై స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. ” త్రివిక్రమ్ కి నాకు మధ్య మనస్పర్థలు ఏర్పడినట్టు వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు.
త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారిన తర్వాత నా సినిమాలకు పని చేయడానికి ఆయనకి టైం కుదర్లేదు. అంతే తప్ప వేరే ఏ కారణాలు లేవు. మా అబ్బాయి కూడా త్రివిక్రమ్ వద్దే ఎక్కువగా ఉండేవాడు. త్రివిక్రమ్ ఎక్కువగా ఫోన్ నంబర్లు మార్చేస్తూ ఉంటాడు. ‘ఉషాపరిణయం’ సినిమా షూటింగ్ చివరి రోజున త్రివిక్రమ్ కొత్త నెంబర్ నుండి నాకు ఫోన్ చేసి మరీ సెట్స్ కి వచ్చారు. మా మధ్య హెల్దీ రిలేషన్ ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.