విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కుతున్న ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) ట్రైలర్ బయటకు వచ్చింది. 2 నిమిషాల 26 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్లో అన్ని అంశాలను టచ్ చేశారు. హీరో ఫ్యామిలీ, పిల్లలతో హీరోకి ఉన్న బాండింగ్, ఫ్యామిలీలో ఉండే ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు. హీరో ఇంటికి రెంట్ కి వచ్చిన హీరోయిన్.. మరోపక్క ఆమె బ్యాక్ స్టోరీ..! ఆమె ఫేస్ చేసే సమస్య కోసం హీరో ఫైట్ చేయడం.. మధ్యలో రొమాంటిక్ ట్రాక్.. ఇలా అన్ని అంశాలను టచ్ చేశారు.
విజయ్ దేవరకొండ ట్రైలర్ ఆరంభంలో ‘గీత గోవిందం’ (Geetha Govindam) లో విజయ్ గోవింద్ మాదిరి పాజిటివ్ గా కనిపించాడు.. తర్వాత వచ్చే సమస్యల కారణంగా అతను ‘అర్జున్ రెడ్డి’ లా (Arjun Reddy) అగ్రెసివ్ గా మారడం మనం గమనించవచ్చు. అక్కడక్కడా దర్శకుడు పరశురామ్(బుజ్జి) (Parasuram) మార్క్ కామెడీ ఎపిసోడ్స్ కూడా ఉన్నట్టు హింట్ ఇచ్చారు. ట్రైలర్ అయితే పర్వాలేదు అనిపించే విధంగా ఉంది.
ఇక ఏప్రిల్ 5 న .. ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ కాబోతుంది.ఉగాది కానుకగా హాలిడేస్ కలిసొచ్చే విధంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు దిల్ రాజు (Dil Raju) . ఈ సమ్మర్ కి పెద్ద సినిమాలు లేవు. పైగా కమర్షియల్ టచ్ ఉన్న ఫ్యామిలీ సినిమాలకి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా చూస్తే ఫ్యామిలీ స్టార్ కి మంచి రిలీజ్ డేట్ దొరికినట్టే. ఇక లేట్ చేయకుండా ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :
సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!
కర్ణాటకలో సినిమాలు బ్యాన్ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్