నందమూరి బాలకృష్ణ సినిమాని ఫైట్స్, డైలాగ్స్ లేకుండా ఊహించుకోలేము. బాలయ్య సినిమా అంటే మాస్ డైలాగులు ఉండాలి. రొమ్మువిరచి విలన్ కు ధీటుగా నిలబడాలి. విలన్ ఎంత బలంగా పొడవుగా ఉన్నా బాలయ్య గంభీరమైన వాయిస్ తో పలికే డైలాగులకి చమటలు తెచ్చుకోవాలి. స్త్రీల గొప్పతనాన్ని ఆయన శైలిలో ఎమోషనల్ గా ఉండడం కూడా ఆనవాయితీగా వస్తోంది. బాలయ్య సినిమాకి ఏం కావాలో అది బోయపాటికి మాత్రమే తెలుసు.
అందుకే వాళ్ళ కాంబినేషన్లో రూపొందే సినిమాలు ఒకదానిని మించి ఇంకోటి అన్నట్టు సూపర్ హిట్లు అవుతున్నాయి.అయితే ఫైట్స్ లేకుండా బాలయ్య సినిమాలు చేయలేదా అంటే చేశారు. ‘శ్రీరామరాజ్యం’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ఎన్టీఆర్ మహానాయకుడు’ తో సహా ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినవే..! కానీ ఆశించిన ఫలితాల్ని అందుకోలేదు. ఫైట్స్ లేకుండా బాలయ్య నటించిన ఒకే ఒక్క సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.
అదే 1990లో వచ్చిన ‘నారి నారి నడుమ మురారి’. ఈ చిత్రాన్ని ఎవరో క్లాస్ డైరెక్టర్ తెరకెక్కించి ఉంటే మనం ఈ సినిమాలో ఫైట్స్ లేవు అని చెప్పనవసరం లేదు. కానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది మాస్ పల్స్ బాగా తెలిసిన కోదండ రామిరెడ్డి. ‘నారి నారి నడుమ మురారి’ వంటి క్లాస్ సబ్జెక్ట్ ను ఆయన తీర్చిదిద్దిన విధానం, ఇందులోని పాటలు, ఎమోషన్స్ అన్నీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇలాంటి క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పటివరకు బాలయ్య చేసింది లేదు..
అలా ప్రయత్నించినా ఫలితాలు అన్నీ తేడా కొట్టాయి..! ఇక ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలో శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించారు. వీళ్ళిద్దరితో బాలయ్య రొమాంటి ట్రాక్ ఇప్పటి యూత్ కు కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి. ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది అని జనాల్లోకి కాన్ఫిడెన్స్ రావడానికి.. హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ బాగా కనెక్ట్ అయితేనే అది సాధ్యమవుతుందని ఈ మూవీ ప్రూవ్ చేసింది.