‘పోకిరి’ (Pokiri) తర్వాత ‘సైనికుడు’ (Sainikudu) ‘అతిథి’ (Athidhi) ‘ఖలేజా’ (Khaleja) వంటి ప్లాపులు ఇచ్చాడు మహేష్ బాబు (Mahesh Babu) . దీంతో ఒక్కసారిగా రేసులో వెనుకబడ్డాడు. ఈ క్రమంలో.. శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ అనే ప్రాజెక్టు ఓకే చేశాడు. మాస్ కామెడీ తో కూడా యాక్షన్ సినిమా ఇది. ఇలాంటి కథని శ్రీను (Srinu Vaitla) వైట్ల డీల్ చేయగలడు అని అప్పటివరకు ఎవ్వరూ ఊహించలేదు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘దూకుడు’ (Dookudu) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
Dookudu Collections
’14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ ఆచంట (Ram Achanta) , అనిల్ సుంకర (Anil Sunkara) , గోపీచంద్ ఆచంట (Gopichand Achanta) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2011 సెప్టెంబర్ 23న విడుదలైంది. నేటితో 13 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా (Dookudu Collections) ఫైనల్ కలెక్షన్స్ ఎంతో ఓ లుక్కేద్దాం రండి :
‘దూకుడు’ చిత్రం రూ.35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.56.7 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బయ్యర్స్ కి ఈ చిత్రం రూ.21.7 కోట్ల లాభాలు అందించింది.