మారుతి (Maruthi Dasari) ఇప్పుడు టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఇతను.. తక్కువ టైంలో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇప్పుడు ప్రభాస్ (Prabhas) వంటి పాన్ ఇండియా స్టార్ తో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) వంటి పాన్ ఇండియా సినిమా చేసే రేంజుకి వెళ్ళాడు. అయితే ఇతని మొదటి సినిమా ‘ఈరోజుల్లో’ రిలీజ్ అయ్యి నేటితో 13 ఏళ్ళు పూర్తయ్యిందట. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టాడు మారుతి. తన జీవితాన్ని మార్చేసిన సినిమా ‘ఈరోజుల్లో’ అని.. ఈ సినిమా తీయడానికి తనకి సపోర్ట్ చేసిన వారందరికీ థాంక్స్ అంటూ అతను చెప్పుకొచ్చాడు.
ఇక ‘గుడ్ సినిమా గ్రూప్’, ‘మారుతి మీడియా హౌస్’ బ్యానర్లపై గుడ్ ఫ్రెండ్స్ వారి నిర్మాణంలో ఈ చిత్రం ద్వారా మంగం శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యాడు. రేష్మా రాథోర్ (Reshma Rathore) హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చింది. కేవలం రూ.45 లక్షల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 2012 వ సంవత్సరం మార్చి 23న రిలీజ్ అయ్యింది. యూత్ ను బాగా ఆకట్టుకుని సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 2.95 cr |
సీడెడ్ | 1.35 cr |
ఉత్తరాంధ్ర | 1.00 cr |
ఈస్ట్ | 0.55 cr |
వెస్ట్ | 0.35 cr |
గుంటూరు | 0.67 cr |
కృష్ణా | 0.58 cr |
నెల్లూరు | 0.36 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.81 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.65 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 8.46 cr |
‘ఈరోజుల్లో’ చిత్రం రూ.0.60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.8.46 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే దాదాపు 10 రెట్లు పైనే లాభాలు తెచ్చిన సినిమా అనమాట. సినిమా రిలీజ్ తర్వాత శాటిలైట్ రైట్స్ రూపంలో మరింతగా వచ్చినట్టు ట్రేడ్ పండితులు వెల్లడించారు. ఈ ఒక్క సినిమాతో మారుతి పేరు మార్మోగింది.