ఇటీవల విడుదలైన ‘ఎఫ్3’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జూలై 22 నుంచి సోనీ లివ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. దీంతో సదరు ఓటీటీ సంస్థ ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా నెట్ ఫ్లిక్స్ లో కూడా అందుబాటులోకి రానుంది ‘ఎఫ్3’. దీనికి కారణం లేకపోలేదు. సోనీ లివ్ కి సబ్ స్క్రైబర్స్ రీచ్ తక్కువ. ఇప్పుడిప్పుడే మెల్లగా ఎదుగుతోంది.
ఇంకా ప్రైమ్, హాట్ స్టార్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తో పోటీ పడే స్టేజ్ కిచేరుకోలేదు . దానికి బాగా సమయం పడుతుంది. అందుకే ‘ఎఫ్3’ సినిమాను ఎక్కువమంది ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ తో పంచుకోనుంది. గతంలో ఇదే తరహాలో సన్ నెక్స్ట్ తన కొత్త సినిమాలు పంచుకునే పద్దతిని ‘అల.. వైకుంఠపురములో’ సినిమాతో మొదలుపెట్టింది. ఇటీవల వచ్చిన ‘డాక్టర్’, ‘ఈటీ’, ‘పెద్దన్న’ వంటి సినిమాల విషయంలో కూడా ఇలానే జరిగింది.
ఇప్పుడు సోనీ లివ్ ఇదే బాట పట్టింది. నెట్ ఫ్లిక్స్ లో బొమ్మ పడితే ఏ రేంజ్ కి వెళ్తుందో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో చూశాం. అందుకే నెట్ ఫ్లిక్స్ తో డీల్ చేసుకున్నారు. సో.. ‘ఎఫ్3’ సినిమాను మన సౌకర్యాన్ని బట్టి ఈ రెండు ఓటీటీల్లో ఎందులోనైనా చూసుకోవచ్చు.
ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న సినిమాలు రెండు వారాలు, నెలలోపే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రెండు నెలల తరువాత ‘ఎఫ్3’ సినిమా డిజిటల్ రూటు పట్టడం విశేషం. నిర్మాతలు దిల్ రాజు ఇకపై అన్ని సినిమాలకు ఇదే పద్ధతి ఫాలో అవుతారా..? లేక ‘ఎఫ్3’కి మాత్రమే పరిమితమవుతారా..? అనేది చూడాలి!