ఇప్పటిదాకా ఫస్ట్ డే కలెక్షన్స్ టాలీవుడ్ లో (Tollywood) సక్సెస్ ఫార్ములాగా మారింది. స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్నాయి, మొదటి రోజే భారీ వసూళ్లను సాధించేందుకు కొత్త వ్యూహాలు పాటిస్తున్నారు. థియేటర్ కౌంట్ పెంచడంతో పాటు టికెట్ రేట్లు పెంచటం ద్వారా తొలి రోజే భారీ షేర్ అందిస్తున్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రమే సినిమాకి సత్తా చూపే టార్గెట్ గా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు టికెట్ ధరల పెంపు చాలా సహాయపడుతోంది.
Tollywood
‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘బాహుబలి 2’ (Baahubali 2), ‘కల్కి 2898ఏడీ’ (Kalki 2898 AD) వంటి చిత్రాలు మొదటి రోజే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ‘దేవర’ (Devara) వంటి చిత్రాలు కూడా ఇదే వ్యూహంతో పెద్ద వసూళ్లను రాబట్టాయి. అయితే ఈ ఫార్ములా యూనిక్ గా ఉండాలంటే, ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తించే ప్రమోషన్లు, ట్రైలర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్ లో మేకర్స్ స్పెషల్ షోలు పెంచడమే కాకుండా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రిలీజ్ కి ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు.
వీటి టికెట్ ధరలు సాధారణ టికెట్ ధరల కంటే రెండింతలు అధికంగా ఉంటున్నాయి. స్పెషల్ షోల ద్వారా వీలైనంత ఎక్కువ థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. అలాగే బెన్ ఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు వంటి స్ట్రాటజీలు ఆదాయం పెంచడానికి కీలకమవుతున్నాయి. అదనంగా రోజుకు ఐదు షోలు వేసే అవకాశంతో, వసూళ్లు మరింతగా పెరుగుతున్నాయి. ఈ సరికొత్త వ్యూహాలతో ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) మూవీ కూడా హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు సాధించేందుకు రెడీగా ఉంది.
విడుదల రోజునే 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించవచ్చని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి 2’ వంటి చిత్రాల రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఈ రకమైన వ్యూహాలు విజయవంతం అయితే, భవిష్యత్తులో తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు మొదటి రోజే 300 కోట్ల వసూళ్లు సాధించడం కూడా సాధ్యమని అంచనా వేస్తున్నారు.