ఒకప్పటి స్టార్ హీరో, కేంద్ర మంత్రి, నిర్మాత, పారిశ్రామిక వేత్త, అయిన రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న కాలం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు, దశదినకర్మలను కూడా హైదరాబాదులోనే నిర్వహించారు. 22- 23వ తారీకులలో ఆయన దశ దిన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే కృష్ణంరాజు సొంత ఊరు నరసాపురం నియోజకవర్గంలో ఉన్న మొగల్తూరు కావడంతో అక్కడ సెప్టెంబర్ 29 న ఈరోజు భారీ సంస్మరణ సభ నిర్వహించబోతున్నారు.
అంతేకాదు ఈ సభకు భారీగా జనాలు తరలివస్తున్నారు అని సమాచారం. వారి సంఖ్య లక్ష వరకు ఉంటుంది అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి రాజకీయ నాయకులు కూడా భారీగా వచ్చి కృష్ణంరాజు గారికి నివాళులు అర్పించనున్నారు.
ఈ సందర్భంగా ఈ సభకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా భోజనం పెట్టి తృప్తి పరిచి పంపాలి అని ఉప్పలపాటి కుటుంబ సభ్యులు ఫిక్స్. కృష్ణంరాజు గారు బ్రతికున్న రోజుల్లో కూడా తన ఇంటికి వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెట్టి అతిథి మర్యాదలు చేసి పంపేవారు.అందుకే ఆయన జ్ఞాపకార్థం ఆయన దిన కార్యక్రమం రోజున కూడా కృష్ణంరాజు కి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ కడుపునిండా అన్నం పెట్టి పంపనున్నారు.
ఈ సందర్భంగా ఎటువంటి భోజన పదార్ధాలు ఏర్పాటు చేస్తున్నారో తెలుసా:
1) రొయ్యల బిర్యానీ
2) రొయ్యల కూర
3) చికెన్ కర్రీ
4) చికెన్ ఫ్రై
5) మటన్ బిర్యానీ
6) మటన్ కర్రీ
7) చేప ఫ్రై
8) చేపల పులుసు (తలకాయ)
వీటితో పాటు స్వీట్స్, మజ్జిగ స్పెషల్, పెరుగు వంటివి కూడా ఉన్నాయి. మొత్తంగా లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. గెస్ట్ లకి అలాగే సామాన్యులకు కూడా ఇవే ఫుడ్ ఐటమ్స్ అని తెలుస్తుంది.