సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఓ మంత్రంలా పనిచేస్తాయి. ఆ కోవలో బాలకృష్ణ (Nandamuri Balakrishna) బోయపాటి (Boyapati Srinu) కాంబో ముందు వరుసలో ఉంటుందనే చెప్పాలి. ‘సింహా’(Simha) , లెజెండ్ (Legend) ‘అఖండ’ (Akhanda) సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మాస్ జోడీ.. ఇప్పుడు ‘అఖండ 2’ (Akhanda 2) కోసం మళ్లీ కలసింది. మొదటి భాగం రికార్డులు సృష్టించడంతో, సీక్వెల్‌పై మరింత హైప్ ఏర్పడింది. అయితే, ఈసారి బోయపాటి బాలయ్యకు మరింత ఊహించని మాస్ రోల్ డిజైన్ చేస్తున్నట్లు టాక్.
ఇప్పటికే బాలయ్యకు శివ తాండవం లాంటి పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో స్క్రిప్ట్ సిద్ధం చేసిన బోయపాటి, ఈసారి కథలో మరింత ట్విస్టులు ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన అప్‌డేట్ ప్రకారం, విలన్ క్యారెక్టర్ కోసం పాన్ఇండియా నటులను సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ఓ కీలక పాత్రలో నటించనుండగా, అసలు విలన్ మాత్రం అతనే కాదు. ఈ ప్రాజెక్ట్‌కు బిగ్ యాడిషన్‌గా బాలీవుడ్ మాస్ విలన్ సంజయ్ దత్ (Sanjay Dutt) జాయిన్ అవ్వనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
సంజయ్ దత్ విలన్‌గా నటిస్తే, బాలయ్యతో అతని యాక్షన్ సన్నివేశాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. బోయపాటి మాస్ ఫైట్స్‌కు పెట్టింది పేరంటే, ఆ యాక్షన్ బ్లాక్‌లు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. బాలకృష్ణ – సంజయ్ దత్ మధ్య హై ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్‌లను ఈ సినిమాలో డిజైన్ చేస్తున్నారని, అవి నెవర్ సీన్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్‌గా ఉండబోతున్నాయని సమాచారం. సంజయ్ దత్ గతంలో ‘కేజీఎఫ్ 2’లో (KGF 2) ‘ అదిరిపోయే విలన్‌గా కనిపించి దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
కానీ, పూర్తిగా తెలుగులో ఇప్పటివరకు హిట్ సినిమా చేయలేదు. రీసెంట్ గా వచ్చిన డబుక్ ఇస్మార్ట్ లో ఆయన రోల్ అంతగా క్లిక్ కాలేదు. ఇక అఖండ 2లో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ‘అఖండ 2’ను పాన్-ఇండియా స్కేల్‌లో తెరకెక్కించేందుకు బోయపాటి భారీ బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. మరింత గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో, ఫైట్స్‌ను హైటెక్‌గా ప్లాన్ చేస్తూ బాలయ్యకు ఓ సరికొత్త రేంజ్ చూపించబోతున్నాడు. మరి ఈ బిగ్ సినిమాపై నెక్స్ట్ అప్‌డేట్ అధికారికంగా ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.