సినిమాలో ఓ సీన్ కోసమో, సాంగ్ కోసమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (AI movie)ను వాడితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల సినిమాల్లో మనుషుల వినియోగం తగ్గిపోతుందని, పనులు ఉండవు అని రచ్చ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఔత్సాహిక సాంకేతిక నిపుణులు ఏకంగా ఏఐతో పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించేశారు. త్వరలో విడుదల చేద్దామని ప్లాన్ కూడా చేశారు. ఆ సినిమా పేరే ‘లవ్ యూ’. ఈ సినిమాలో శాండిల్‌వుడ్‌లో నిర్మించారు.
దీని కోసం మొత్తంగా రూ. 10 లక్షలే ఖర్చయిందట. మేలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారట. రొమాంటిక్ డ్రామా జోనర్లో రూపొందిన ఈ సినిమాను బెంగళూరులోని బాగలగుంట ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులుగా ఉన్న దర్శక నిర్మాత నరసింహ మూర్తి, ఏఐ నిపుణుడు నూతన్ కలసి రూపొందించారు. వారిద్దరు తప్ప నటులు, సంగీతం, పాటలు, డబ్బింగ్.. ఇలా అన్నీ ఏఐతో రూపొందించారట. నరసింహ మూర్తి ఇంతకు ముందు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు కూడా.
ఇక నూతన్ LLB చదివారు. పదేళ్లుగా కన్నడ సినిమాలో సహాయ దర్శకుడిగా, ఎడిటర్‌గా చేశారు. ఇప్పుడు ఏఐతో సినిమా చేసేశారు. ఈ సినిమా కోసం 6 నెలలు కష్టపడ్డారు. గంటన్నర నిడివి ఉన్న ఈ సినిమాలో 12 పాటలు ఉన్నాయి. U/A సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమా కోసం 30 ఏఐ టూల్స్‌ని (AI movie) ఉపయోగించారట.
మనుషులతో మనుషులు తీస్తున్న సినిమాలకే ఠికానా లేని రోజులు ఇవి. అలాంటిది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసింది అంటున్న ఈ సినిమా ఎలా ఉంటుదో, ఎంతగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఒకవేళ కనెక్ట్ ఇండియన్ సినిమాలో కొత్త యుగం స్టార్ట్ అయినట్లే అని చెప్పొచ్చు. తేడా కొడితే ఇలాంటి ప్రయోగాలు ఇప్పట్లో రావు అని చెప్పొచ్చు.