పెద్ద సినిమాలకి ఓపెనింగ్స్ బాగా రావాలి అంటే.. రిలీజ్ డేట్ కూడా మంచిది దొరకాలి. అవును.. ఏడాదికి పెద్ద సినిమాలు 3 ,4 మాత్రమే రిలీజ్ అవుతూ ఉంటాయి. చాలా వరకు నిర్మాతలు వీటికి సోలో రిలీజ్ దక్కేలా చూస్తుంటారు. ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) హీరోలైన రాంచరణ్ (Ram Charan) , ఎన్టీఆర్ (Jr NTR) లు.. తమ నెక్స్ట్ సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసిన/చేస్తున్న సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులుగా ఈ హీరోలు కనిపించడానికి రెడీ అయ్యారు.
Devara
ముందుగా ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) ఈ సెప్టెంబర్ 27 కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై కొంత నెగిటివిటీ ఉంది. ఎందుకంటే.. ‘ఆచార్య’ (Acharya) తో పెద్ద డిజాస్టర్ ఇచ్చిన కొరటాల (Koratala Siva) దీనికి దర్శకుడు కావడం వల్ల. వాటికి తగ్గట్టే తొలిరోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ భారీ వసూళ్లు సాధించింది. అటు ఇటుగా 80 శాతం రికవరీ జరిగిపోయింది. అందుకు ప్రధాన కారణం.. ‘దేవర’ కి మంచి రిలీజ్ డేట్ దొరకడం వల్లనే అని చెప్పవచ్చు.
అవును సెప్టెంబర్ 28 అనేది పాన్ ఇండియా సినిమాలకి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్. ఈ డేట్ కి రిలీజ్ అయిన సినిమాలకి గాంధీ జయంతి, దసరా… హాలిడేస్ కలిసొస్తాయి. నార్త్ లో కూడా ఈ టైంలో సినిమాలు బాగా చూస్తారు. ‘దేవర’ కి మిక్స్డ్ టాక్ వచ్చినా మాస్ ఆడియన్స్.. బాగానే ఆదరిస్తున్నారు. నార్త్ లో కూడా ఈ సినిమా నిలదొక్కుకుంది. అలా ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయ్యింది అని చెప్పవచ్చు.
కానీ మరో ‘ఆర్.ఆర్.ఆర్’ హీరో రాంచరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ కి (Game changer) ఈ అడ్వాంటేజ్..లు కనిపించడం లేదు. ఎందుకంటే డిసెంబర్ 20 కి ఈ సినిమా రిలీజ్ అనుకున్నారు. దానికి ముందు ‘పుష్ప’ (Pushpa) అనే పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతుంది. మరోపక్క ‘ముఫాసా’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్ ‘ముఫాసా’ కే ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ముందుగానే గ్రహించిన నిర్మాత దిల్ రాజు (Dil Raju) 2025 సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’ ని రంగంలోకి దింపాలని భావిస్తున్నట్టు సమాచారం.
ఒకవేళ అది నిజమైనా.. ఆ టైం ‘గేమ్ ఛేంజర్’ కి పెద్దగా కలిసి రాకపోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో నార్త్ ఆడియన్స్ పెద్దగా థియేటర్లకు వెళ్లరు. మరి ‘హనుమాన్’ (Hanuman) బాగా చూశారు కదా అని మీరు అడగొచ్చు. ‘హనుమాన్’ రిలీజ్ టైంలో అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు రామ నామ స్మరణలో ఉన్నారు. పైగా ‘హనుమాన్’ బడ్జెట్ పరంగా కూడా చిన్న సినిమా కాబట్టి వర్కౌట్ అయ్యింది. కానీ ‘గేమ్ ఛేంజర్’ విషయంలో ఈ సీన్ రిపీట్ అవ్వకపోవచ్చు అనేది కొందరి అభిప్రాయం.