Ghallu Ghallu Song: ‘ఉషాపరిణయం’ నుండి ఆకట్టుకుంటున్న ‘ఘల్లు ఘల్లు’.!
- July 24, 2024 / 04:50 PM ISTByFilmy Focus
‘స్వయంవరం’ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) ‘మల్లీశ్వరి’ (Malliswari) ‘మన్మధుడు’ ‘ప్రేమ కావాలి’ (Prema Kavali) వంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ అందించిన దర్శకులు కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar) గారి దర్శకత్వంలో.. ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఉషాపరిణయం’. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి 4 పాటలు బయటకు వచ్చాయి. అన్నిటికీ మంచి రెస్పాన్స్ లభించింది. 5 వ పాటగా ఇప్పుడు ‘ఘల్లు ఘల్లు’ అనే లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది.
ఇది హీరో శ్రీ కమల్ అలాగే సీరత్ కపూర్ ల మధ్య సాగే మాస్ నెంబర్. శ్రీ కమల్ డాన్స్, సీరత్ కపూర్ (Seerat Kapoor) అందాలు ప్రధాన ఆకర్షణగా ఈ లిరికల్ సాంగ్స్ లో విజువల్స్ ఉన్నాయి. అలాగే సురేష్ బానిసెట్టి అందించిన లిరిక్స్ కూడా క్యాచీగా ఉన్నాయి. సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ అందించిన ట్యూన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాస్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేసే విధంగా ఈ పాటకి అతను ట్యూన్ సమకూర్చాడు.

విజయ్ భాస్కర్ మ్యూజిక్ టేస్ట్ గురించి అందరికీ తెలిసిందే. ‘నువ్వేకావాలి’ ‘నువ్వు నాకు నచ్చావ్’ ‘మల్లీశ్వరి’ వంటి సినిమాల్లో పాటలు కూడా వినసొంపుగా ఉంటాయి. ‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva) ‘మసాలా’ (Masala) వంటి సినిమాలు కూడా మ్యూజికల్ హిట్సే. ఇప్పుడు ‘ఉషాపరిణయం’ కూడా మ్యూజికల్ గా హిట్ అనే చెప్పాలి. ఈ మాస్ పాటని మీరు కూడా ఓ లుక్కేయండి :















