టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ సే’. ‘సి.కె.స్క్రీన్స్’ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి గోపికృష్ణ పట్టాభి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రం పర్వాలేదు అనిపించింది. దీంతో ‘గాడ్ సే’ కూడా ఆకట్టుకుంటుంది అని అంతా అనుకున్నారు. ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. జూన్ 17న నిన్న విడుదలైన ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది.
దీంతో మొదటి రోజు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. మొదటి వీకెండ్ ను ఈ మూవీ క్యాష్ చేసుకోలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.23 cr
సీడెడ్
0.12 cr
ఉత్తరాంధ్ర
0.14 cr
ఈస్ట్
0.04 cr
వెస్ట్
0.05 cr
గుంటూరు
0.06 cr
కృష్ణా
0.07 cr
నెల్లూరు
0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
0.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.03 cr
ఓవర్సీస్
0.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
0.80 cr
‘గాడ్ సే’ చిత్రానికి రూ.3.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.3.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి వీకెండ్ ఈ చిత్రం రూ.80 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. టాక్ నెగిటివ్ గా రావడం..
పోటీగా ‘అంటే సుందరానికీ!’ ‘విరాటపర్వం’ ‘విక్రమ్’ వంటి చిత్రాలు ఉండడం వలన ఈ మూవీ ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది అని చెప్పాలి. వీక్ డేస్ లో కూడా బాగా కలెక్ట్ చేస్తే తప్ప ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.