‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ (S. Radha Krishna) నిర్మించే సినిమాలు అన్నిటికీ త్రివిక్రమ్ శ్రీనివాసే (Trivikram) డైరెక్ట్ చేస్తూ వచ్చారు. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ తో ఎస్.రాధాకృష్ణ ఈ బ్యానర్ ను స్థాపించారు. అప్పటి నుండి ఈ బ్యానర్లో త్రివిక్రమ్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ (S/O Satyamurthy) నుండి త్రివిక్రమ్.. కేవలం ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ (Haarika & Hassine) లోనే సినిమాలు చేస్తున్నారు. ‘ఆ బ్యానర్ నుండి త్రివిక్రమ్ బయటకు వచ్చి సినిమాలు చేయడా?’
Haarika & Hassine
‘త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తప్ప ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు వేరే స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయరా? వంటి ప్రశ్నలు నిత్యం హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. వీటిపై నాగవంశీ (Suryadevara Naga Vamsi) పలుమార్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ”హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అనే బ్యానర్ రాధాకృష్ణ గారు, త్రివిక్రమ్ గారు కలిసి పెట్టింది. అందులో త్రివిక్రమ్ గారి సినిమాలే వస్తాయి’ అంటూ ఒక సందర్భంలో ఓపెన్ గానే ఆన్సర్ ఇచ్చారు నాగవంశీ.
మిగిలిన దర్శకుల కోసం ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ను స్థాపించి డెవలప్ చేసినట్టు కూడా నాగవంశీ పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇది చాలా మంది పెద్ద దర్శకులకి ఇష్టం లేక ‘సితార..’ లో సినిమాలు చేయడానికి వెనకడుగు వేసినట్టు కూడా కథనాలు వినిపించాయి. ఏదేమైనా ఇప్పుడు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు తమ పంథా మార్చుకోబోతున్నట్టు సమాచారం.
మేటర్లోకి వెళితే.. ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. దీనిని నాగవంశీ నిర్మాతారంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ బాధ్యతని ఎస్.రాధాకృష్ణ తీసుకున్నట్లు ఇన్సైడ్ టాక్. అయితే అధికారిక ప్రకటన వస్తేనే దీనిపై అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.