పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మార్చి 28న విడుదల కాబోతుందనే అప్డేట్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే టీజర్లు, లిరికల్ సాంగ్స్ బయటకొచ్చాయి. మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ప్రతీ అప్డేట్ లో కూడా రిలీజ్ డేట్ స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు. కానీ, షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న వార్తలు ఫ్యాన్స్‌లో భయాలను రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే, పవన్ నాలుగు రోజుల డేట్స్ ఇస్తేనే మిగిలిన షూటింగ్ పూర్తవుతుందట.
యూనిట్ మాట ప్రకారం, పవన్ కళ్యాణ్ ఆ డేట్స్ త్వరలోనే ఇస్తాడనే ధీమా ఉంది. కానీ, సినిమా చెప్పిన టైమ్ కి వస్తుందనే విషయంలో అభిమానులు మాత్రం నమ్మడంలేదు. ప్రస్తుతం పవన్ ‘ఓజీ’ (OG Movie) షూటింగ్‌తో బిజీగా ఉండడం, మిగతా సమయాన్ని రాజకీయాల్లో కేటాయించడం వల్ల వీరమల్లు షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది. అందుకే, కొన్ని రోజులుగా అభిమానులు సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక, మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, నితిన్ (Nithin Kumar) ‘రాబిన్ హుడ్’ (Robinhood) సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా మార్చి 28నే విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. పవన్ మూవీ వాస్తవంగా ఆ రోజున వస్తే, నితిన్, నాగవంశీ (Suryadevara Naga Vamsi) లాంటి పవన్ అభిమానులు తమ సినిమాలను అదే రోజున రిలీజ్ చేసేవారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘హరిహర వీరమల్లు’ నిజంగానే రిలీజ్ అవుతుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా? అన్నది ఇంకా క్లారిటీ రావడం లేదు.
పవన్ ఫ్యాన్స్ మాత్రం, “మూవీ ప్రమోషన్ ఎంత జరిగినా, షూటింగ్ పూర్తి కాకపోతే ఎలా రిలీజ్ అవుతుంది?” అంటూ డౌట్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, పవన్ డేట్స్ ఖరారు చేసి, షూటింగ్ పూర్తి అయ్యేంతవరకు ఈ అనుమానాలు కొనసాగే అవకాశం ఉంది. యూనిట్ ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నా, ఫ్యాన్స్‌కి నమ్మకం కలిగేలా స్పష్టమైన ప్రకటన రావాలి. మరి, ఈ సందేహాలకు పుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.