Harish Shankar: పవన్ యస్‌తో డిస్ట్రబెన్స్.. చాలా సినిమాలకు నటులు నో చెప్పాల్సిందేనా?
- May 30, 2025 / 01:56 PM ISTByFilmy Focus Desk
సమయం దొరికినేప్పుడే సక్కబెట్టుకోవాలి.. లేదంటే మళ్లీ ఎప్పుడు వస్తుందో టైమ్ తెలియదు. ఇప్పుడు ఇదే లైన్ పట్టుకుని వరుస ఫోన్ కాల్స్, అపాయింట్‌మెంట్లతో బిజీగా ఉన్నారు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar). ఆయనకు వచ్చిన సమయం ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh) . ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తారు. దీని కోసం ఆయన ఇతర నటుల డేట్స్‌ను పట్టుకునే పనిలో ఉన్నారట. ఈ మేరకు కొంతమంది దగ్గర నుండి బల్క్ డేట్స్ తీసుకున్నారు అని చెబుతున్నారు.
Harish Shankar

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తొలి షెడ్యూల్ తర్వాత ఆపేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్పుడప్పుడు పవన్ (Pawan Kalyan) సినిమాలవైపు వచ్చినా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాకే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. వచ్చే నెల 12న రిలీజ్ చేస్తారని సమాచారం. మరోవైపు ‘ఓజీ’ (OG Movie) సినిమా షూటింగ్ ఇటీవల స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఛాన్స్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’కేనట. దీని కోసం పవన్ బల్క్ డేట్స్ ఇచ్చారని సమాచారం.

ఈ నేపథ్యంలో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) డేట్స్‌ను కూడా టీమ్ తీసుకుందట. ఆమె తమిళ, తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్నా.. పవన్ సినిమా కోసం బల్క్ డేట్స్ అడ్జెస్ట్ చేసి ఇచ్చిందట. కొన్ని సందర్భాల్లో డబుల్ షిఫ్ట్‌లు, ఫ్లయిట్ జగ్లింగ్‌లు కూడా చేయాల్సి వస్తుందట. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో ఈ విషయంలో క్లారిటీ వస్తుంది లెండి. అలాగే ఇతర ప్రధాన పాత్రధారుల డేట్స్ కూడా ఫిక్స్ చేసే పనిలో ఉందట సినిమా టీమ్.

ఇక ఈ సినిమాను తొలు ‘తెరి’ / ‘పోలీసు’ (Theri) సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తారని చెప్పారు. ఆ తర్వాత సెకండాఫ్ మాత్రమే అందులోంచి తీసుకుంటారు అని చెప్పారు. అయితే ఇప్పుడు హరీశ్ శంకర్ సొంత కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది అని తేలింది. ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన పేరు మీద ‘కథ’ కూడా ఉంది.

















