జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబో మూవీ దేవర (Devara) ఒకింత భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కగా ఈ సినిమా డిజిటల్ హక్కులను 170 కోట్ల రూపాయలకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవర డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ ఒకింత భారీగానే ఖర్చు చేసింది. ఆర్ఆర్ఆర్ ఓటీటీలో సాధించిన సంచలన రికార్డులు దేవర డిజిటల్ హక్కులకు డిమాండ్ ఏర్పడటానికి కారణమని చెప్పవచ్చు.
Devara
దేవర విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ వచ్చేసింది. దేవర సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అప్పటివరకు ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూసే పరిస్థితి అయితే ఉండదని చెప్పవచ్చు. నవంబర్ 20 తర్వాత దేవర మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
దేవర థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఓటీటీలో సైతం సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు. దేవర మూవీలో తండ్రీ కొడుకుల పాత్రలలో కనిపించనున్నానని తారక్ బియాండ్ ఫెస్ట్ లో కామెంట్ చేశారు. ఈ సినిమా ఇంటర్వెల్ కూడా ఒకింత ఊహలకు భిన్నంగానే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర సినిమా డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సమాచారం.
దేవర1 రిలీజైన తర్వాత నటీనటుల డేట్లను బట్టి దేవర2 విషయంలో నిర్ణయం తీసుకుంటామని మేకర్స్ చెబుతున్నారు. దేవర సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు పెరగగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకోలేదని కథ డిమాండ్ చేయడంతో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. దేవర సినిమా కథనం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. దేవర సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తారా అనే చర్చ సైతం మేకర్స్ క్లారిటీ ఇచ్చినా జరుగుతోంది.