న్యాచురల్ స్టార్ నాని సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుసగా విజయాలను సొంతం చేసుకున్నారు. నాని సినిమాలలో మెజారిటీ సినిమాలు పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కడంతో ఈ సినిమాల నిర్మాతలకు సినిమా ఫ్లాపైనా నష్టాలు రాలేదు. నాని నటించిన దసరా సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల కానుంది. దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. దసరా సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు
. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాని దసరా సినిమాతో కచ్చితంగా సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దాదాపుగా 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో దసరా సినిమా తెరకెక్కడం గమనార్హం. దసరా సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు 60 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సులువుగా 40 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యే అవకాశాలు ఉన్నాయి.
విడుదలకు ఆరు నెలల ముందే ఈ సినిమాపై పాజిటివ్ గా అంచనాలు నెలకొన్నాయి. తన సినిమాకు 100 కోట్ల రూపాయల బిజినెస్ జరిగేలా జాగ్రత్త పడుతూ హీరో నాని అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకున్నారు. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.
నాని కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు వెలువడాల్సి ఉంది. నాని ఈ సినిమాకు గత సినిమాల కంటే తక్కువ పారితోషికం తీసుకున్నారు. ఈ సినిమాకు నాని రెమ్యునరేషన్ 12 కోట్ల రూపాయలు కాగా నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.