డ్రగ్స్ కేసులో సీనియర్ హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తమిళ ప్రేక్షకులకి మాత్రమే కాదు తెలుగు జనాలకి కూడా పెద్ద షాకిచ్చింది.చెన్నైలోకి ఓ పబ్బులో గొడవ జరిగింది. ఈ క్రమంలో కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం… అటు తర్వాత విచారణలో అతను శ్రీరామ్ పేరు చెప్పడం జరిగింది. దీంతో ఈ గొడవని లోతుగా పరిశీలించిన పోలీసులు శ్రీరామ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు.
వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్దారణ అయినట్టు తెలుస్తోంది. శ్రీరామ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించడం జరిగింది.తర్వాత అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే శ్రీరామ్ టీం ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం.. జరిగింది. అతని లీగల్ టీం ప్రయత్నాలు కూడా ఫలించడంతో బెయిల్ మంజూరైంది.
కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసి శ్రీరామ్ కి కొంత ఊరటనిచ్చింది మద్రాసు హైకోర్టు. అలాగే విచారణకు కూడా అన్ని రకాలుగా సహకరించాలని ఆదేశించింది. ఈ కేసులో శ్రీరామ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు అలాగే వారి వారసులు కూడా ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో శ్రీరామ్ సినీ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే… లీగల్ ఇష్యూస్ లో చిక్కుకున్న చాలా మంది సినీ నటుల జీవితాలు తర్వాత తలక్రిందులు అయిపోయాయి.