మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఇతర భాషల నుంచి గట్టి పోటీ విడుదలవుతోంది. టిల్లు స్క్వేర్ సినిమా కూడా అదే సమయంలో విడుదల కానుండగా జైలర్ సినిమా కూడా అదే తేదీకి ఫిక్స్ అయింది. రణ్ బీర్ సందీప్ కాంబోలో తెరకెక్కుతున్న యానిమల్ కూడా అదే తేదీన విడుదల కానుంది.
ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు విడుదలైతే ఆ సినిమాల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. భోళా శంకర్ రిలీజ్ డేట్ విషయంలో చిరంజీవి నిర్ణయం రైటేనా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ కూడా బాలేదనే సంగతి తెలిసిందే. వేదళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు భోళా శంకర్ సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
వేదాళం సినిమా తమిళంలో హిట్ కాగా ఇతర భాషల ప్రేక్షకుల నుంచి (Bhola Shankar) ఈ మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. భోళా శంకర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. భోళా శంకర్ సినిమాతో చిరంజీవి మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవి పారితోషికం 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనుండగా ఆ సినిమాలపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వయస్సు పెరుగుతున్నా మెగాస్టార్ ఎనర్జీ లెవెల్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.