ఒకే కథతో చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ అన్నీ హిట్ అవుతాయి అని చెప్పలేం. కథ ఎంత బాగున్నా.. కథనం పర్ఫెక్ట్ గా కుదిరితేనే.. ఫలితం అనుకూలంగా వస్తుంది. అలాంటి ఉదాహరణే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. 2001 అక్టోబర్ 4న చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమా రిలీజ్ అయ్యింది. చిరుకి ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు.చిరు ఇమేజ్ కి పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ సినిమా. స్వతహాగా టాప్ పొజిషన్ కి వెళ్లిన ఓ వ్యక్తి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి.. అలాగే తన కూతురితో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు.
Dady Movie
అనుకోకుండా హీరో కూతురు భయంకరమైన వ్యాధి భారిన పడుతుంది. అదే టైంలో ఆస్తి పోగొట్టుకోవడం.. దాచుకున్న డబ్బులు దానం చేయాల్సి రావడం.. తర్వాత కూతుర్ని కోల్పోవడం జరుగుతుంది. హీరోయిన్ .. హీరోని వదిలి దూరంగా వెళ్లిపోవడం. ఇలాంటి కథ చిరు ఇమేజ్ కి సెట్ అవ్వలేదు. దీంతో ఫలితం తేడా కొట్టేసింది. అయితే సేమ్ కథతో వెంకటేష్ ‘తులసి’ రూపొందింది. ఇక్కడ కొడుకు ఉంటాడు.అతనికి కూడా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉంటాడు.
కొన్ని గొడవల కారణంగా హీరో, హీరోయిన్స్ విడిపోతారు. అయితే కొడుకుని కాపాడుకోవడానికి హీరో వస్తాడు. క్లైమాక్స్ తెలిసిందే. బోయపాటి తీసిన ఈ సినిమా సూపర్ హిట్. సరిగ్గా ఇలాంటి కథతోనే అజిత్ ‘విశ్వాసం’ అనే సినిమా చేశాడు. ఇందులో కూడా హీరో,హీరోయిన్స్ విడిపోతారు. కూతురుకి ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే ఇక్కడ ఆమెకు ఎటువంటి వ్యాధి ఉండదు. విలన్ వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది.
కూతురి కోసం.. విడిపోయిన భార్య వద్దకు హీరో వస్తాడు. క్లైమాక్స్ లో కూతుర్ని కాపాడి.. తన భార్యను కూడా దక్కించుకుంటాడు హీరో. ఒకే లైన్ తో రూపొందిన ఈ 3 సినిమాలు.. కథనం పరంగా డిఫరెంట్ గా ఉంటాయి. ఫలితాలు మాత్రం ఇద్దరికి ఒకలా.. ఇంకొకరికి ఇంకోలా నమోదయ్యాయి.