మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) 1983 వ సంవత్సరం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఏడాది చిరంజీవికి సంబంధించి 10 కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవే.. ‘ప్రేమ పిచ్చోళ్ళు’ ‘పల్లెటూరి మొనగాడు’ ‘అభిలాష’ ‘ఆలయ శిఖరం’ ‘శివుడు శివుడు శివుడు’ ‘పులి బెబ్బులి’ ‘గూఢచారి నెంబర్ 1’ ‘మగమహారాజు’ ‘రోషగాడు’ ‘మా ఇంటి ప్రేమాయణం’ ‘సింహపురి సింహం) ‘మంత్రిగారి వియ్యంకుడు’ ‘సంఘర్షణ’ వంటి సినిమాలతో పాటు ‘ఖైదీ’ (Khaidi) కూడా అదే ఏడాది రిలీజ్ అయ్యింది.
Khaidi
ఈ ఒక్క సినిమా చిరంజీవి ఇమేజ్ ని మార్చేసింది అని చెప్పాలి. అవును ఖైదీ సినిమా వల్లే చిరంజీవి స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 1983 అక్టోబర్ 28 న ‘ఖైదీ’ రిలీజ్ అయ్యింది. అంటే నేటితో 41 ఏళ్లు పూర్తి కావస్తోంది. అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి కాదు. ముందుగా ఈ కథని సూపర్ స్టార్ కృష్ణ (Krishna) కోసం డిజైన్ చేశారు రైటర్స్ పరుచూరి బ్రదర్స్ (Paruchuri Gopala Krishna, Paruchuri Venkateswara Rao).
ఏ.కోదండరామిరెడ్డి (A. Kodandaramireddy) దర్శకత్వంలో సినిమా చేయడానికి కృష్ణ అప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాకపోతే నిర్మాత విషయంలో తేడా రావడంతో కృష్ణ తప్పుకున్నారు. ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్.. చిరంజీవి పేరు రిఫర్ చేయడం జరిగిందట. అలా చిరంజీవి ఈ ప్రాజెక్టులోకి రావడం జరిగింది. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ 33 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశారు. ఇక మొదటి రోజు లిమిటెడ్ రిలీజ్ తోనే సరిపెట్టుకున్న ఈ చిత్రం..
మౌత్ టాక్ తో షో షోకి హౌస్ ఫుల్ బోర్డులు పెరిగాయి. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది ‘ఖైదీ’. అలా సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేయడంతో టాలీవుడ్ కి మెగాస్టార్ దొరికినట్టు అయ్యింది. అలా అని ఈ సినిమాకి గాను చిరంజీవి మెగాస్టార్ ట్యాగ్ ఇవ్వలేదు. సుప్రీమ్ హీరో ట్యాగ్ ఇచ్చారు. 1988 లో వచ్చిన ‘మరణ మృదంగం’ చిత్రంతో మెగాస్టార్ ట్యాగ్ దక్కింది చిరుకి..!