ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) ..ల ‘కల్కి..’ (Kalki 2898 AD) మొదటి వారం సూపర్ గా కలెక్ట్ చేసింది. ఓవర్సీస్, నైజాం, కర్ణాటక, తమిళనాడు, నార్త్ వంటి ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పట్టింది. అయితే ఆంధ్రాలో మాత్రం బ్రేక్ ఈవెన్ కాలేదు. సీడెడ్ : 25 కోట్లు, ఉత్తరాంధ్ర : 25 కోట్లు, ఈస్ట్ : 15 కోట్లు, వెస్ట్: 11 కోట్లు, కృష్ణా: 14 కోట్లు, గుంటూరు: 12 కోట్లు, నెల్లూరు: 7 కోట్లు..
ఇలా ఆంధ్రాలో మొత్తంగా రూ.109 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది ‘కల్కి 2898 ad’ సినిమా. కానీ ఇప్పటివరకు అంటే 9 రోజులకు గాను సీడెడ్ : 16.62 కోట్లు,ఉత్తరాంధ్ర : 16.60 కోట్లు,ఈస్ట్ : 9.91 కోట్లు,వెస్ట్ : 6.38 కోట్లు,కృష్ణా : 8.88 కోట్లు,గుంటూరు : 8.96 కోట్లు,నెల్లూరు :4.58 కోట్లు.. షేర్ ను రాబట్టింది. అంటే మొత్తంగా రూ.71.93 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.37.07 కోట్ల షేర్ ని అక్కడ రాబట్టాల్సి ఉంది.
రెండో వీకెండ్ కి గట్టిగా రాబడితే తప్ప.. ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సినిమా జోనర్, పెరిగిన టికెట్ రేట్లు, ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా .. ఆంధ్రాలో కలెక్షన్స్ పై దెబ్బ పడినట్లు తెలుస్తుంది. వచ్చే వారం కమల్ హాసన్ (Kamal Haasan) – శంకర్..ల (Shankar) ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా టాక్ కనుక బెటర్ గా వస్తే.. ‘కల్కి..’ లాంగ్ రన్ కి ఫుల్ స్టాప్ పడినట్టే..!