తెలుగు హీరో వెళ్లి హిందీలో సినిమా చేయడం అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. ఇలా చేసినవాళ్లు ఇటీవల కాలంలో చాలా తక్కువమంది కనిపిస్తున్నారు. మన దర్శకులు అక్కడకు వెళ్లి అక్కడ అదరగొడుతున్నారు. హీరోలు ఇప్పుడు అదే పనిలో ఉన్నారు అని టాక్. ఈ క్రమంలో తొలి అడుగు తారక్ నుండే పడింది. ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ (Jr NTR) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. తాజాగా మరో పుకారు తెలిసింది.
Jr NTR
నిజానికి ఇది పుకారు కాదు కానీ, గతంలో వచ్చిన గాసిప్స్‌కి కాస్త ఎక్స్‌టెండెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమాలో తారక్ రోల్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు అని తొలుత వార్తలొచ్చినప్పుడు బయటికొచ్చిన అంశం ఇందులో తారక్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపిస్తాడు అని. దీంతో ‘వార్ 2’లో తారక్ విలనా? అనే ప్రశ్న ఉదయించింది. ఇప్పుడు ఆ టాపిక్‌నే తారక్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడు అని చెబుతున్నారు.
అంటే, సినిమా ప్రారంభంలో తారక్ ఇండియా పాలిట విలన్‌గా కనిపిస్తాడని, కానీ అలా చేయడానికి వెనుక ఓ పెద్ద కారణం ఉంటుంది అని అంటున్నారు. ఆ కారణం సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ అని ఏవేవో చెబుతున్నారు. మరికొందరైతే ఇది డబుల్ రోల్ అని, ఒక తారక్ పాత్రకు మరో పాత్రకు జరిగే యుద్ధమే సినిమా అని మరో కథ చెబుతున్నారు. ఫైనల్‌గా ఈ సినిమాలో హృతిక్ (Hrithik Roshan) కంటే తారక్‌కే ఎక్కువ విలువ ఉంటుంది అనే చెప్పే ప్రయత్నమూ చేస్తున్నారు.
ఇక్కడో విషయం ఏంటంటే ఆ సినిమాను తెరకెక్కిస్తున్నది బాలీవుడ్ నిర్మాణ సంస్థ. వాళ్లు అక్కడి హీరోను హైలైట్ చేసే ఆలోచనలోనే ఉంటారు. ఈ లెక్కన పాత్ర బలం దేనికి ఎక్కువ అనేది మనం ఊహించొచ్చు. అయితే ఇప్పుడు బాలీవుడ్ ఢీలా పడిన నేపథ్యంలో ఏమైనా జరగొచ్చు.