నవీన్ పోలిశెట్టితో (Naveen Polishetty) తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) ఓ సినిమా ప్లాన్ చేశారు. 36 ఏళ్ల తర్వాత మణిరత్నం తెలుగులో స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అయ్యారని చెప్పుకున్నారు అంతా. రుక్మిణి వసంత్ ను (Rukmini Vasanth) హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. నిర్మాత కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. మొదట తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు తమిళ వెర్షన్ కు శింబుని హీరోగా తీసుకున్నారట.
Naveen Polishetty
ఎందుకంటే నవీన్ పోలిశెట్టి.. ఈ ప్రాజెక్ట్ కి సైన్ చేయడానికి ఆలోచిస్తున్నాడట. ఎందుకంటే.. ఈ కథలో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది అనేది అతని ఉద్దేశంగా తెలుస్తుంది. నవీన్ చేసే ప్రతి సినిమా విషయంలో.. అతను స్క్రిప్ట్ లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాడు. లేట్ అయినా పర్వాలేదు.. సినిమా తాను అనుకున్నట్టే రావాలి అనేది అతని సిద్ధాంతం. కానీ మణిరత్నం అలా కాదు. ఆయన ఇంకొకరి సలహాలు, సూచనలు తీసుకునే రకం కాదు.
ఆయన నిర్మాతగా మారింది కూడా ఇందుకే. ఈ కారణాల వల్ల .. వీరికి సింక్ కుదరడం లేదు అని తెలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు డౌట్ గా మారిందని టాక్. మరోపక్క నవీన్ పోలిశెట్టి.. ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) అనే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతుందని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.