సినిమా పోతే.. ఆ సినిమా నిర్మాతను అలా వదిలేయడం మెగా ఫ్యామిలీ స్టైల్ కాదు. వాళ్ల తప్పు లేకపోయినా నిర్మాతకు నష్టం కలగకుండా చూసుకుంటూ ఉంటారు. ఈ విషయం మరోసారి నిరూపితమవుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)సినిమా తీసుకొచ్చిన నష్టాల నుండి నిర్మాత దిల్ రాజును (Dil Raju) బయపడేసేందుకు రామ్‌చరణ్ (Ram Charan) ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు రామ్ చరణ్ తన నిర్ణయాన్ని ఇప్పటికే దిల్ రాజుకు చెప్పేశారు అని అంటున్నారు.
Ram Charan
‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఈ సంక్రాంతికి వచ్చారు రామ్ చరణ్ – శంకర్ (Shankar) . దిల్ రాజు నిర్మాణ సంస్థలో 50వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ‘చాలా’ కారణాల వల్ల తేడా ఫలితం అందుకుంది. ఏ సినిమాకు రానంత నెగిటివిటీ, పైరసీ సమస్య ఈ సినిమాకు వచ్చింది. దీంతో సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో రామ్‌చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేయడానికి రామ్‌చరణ్ ఓకే చెప్పాడు అని అంటున్నారు. ఈ సినిమా కోసం భారీ పారితోషికం కాకుండా తగ్గించి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్.. బుచ్చిబాబుతో (Buchi Babu Sana) ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా తర్వాతనే దిల్ రాజు సినిమా ఉండొచ్చు అంటున్నారు.
మరి ఆ సినిమాకు దర్శకుడు ఎవరు? అనేది ఇప్పుడు మరో ప్రశ్న కూడా. దిల్ రాజు ఆస్థానంలో చాలా మంది దర్శకులు ఉన్నారు. కాబట్టి రామ్ చరణ్ ఓకే అంటే సినిమాను ఓకే చేయడం పెద్ద విషయం కాదు. దీంతో ఇక్కడ అసలు మేటర్ ఏంటంటే రామ్‌చరణ్ ఆ నిర్ణయం తీసుకున్నాడా లేదా అనేది ఇక్కడ విషయం.