‘లైగర్’ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ సినిమాకు వచ్చిన హైప్, ఆ సినిమా ప్రచారంలో విజయ్ చేసిన ‘వాట్ లగా దేంగే’ హై చేటు చేశాయి అని చెప్పొచ్చు. ఆ తర్వాత విజయ్ ఆలోచన తీరులో కాస్త మార్పు వచ్చింది అంటున్నారు. ఆ విషయంలో ఇటీవల విజయ్ మాటల్లో కనిపించింది కూడా. ‘ఖుషి’ సినిమా ఫలితం విషయంలో ఇండస్ట్రీ వర్గాలదో మాట, ప్రొడక్షన్ హౌస్‌ది ఒక మాట ఉన్నా… మంచి విజయం అయితే అందుకున్నారు.
ఇప్పుడు ఆ ఫ్లోని కంటిన్యూ చేయడానికి విజయ్ ఏకంగా మూడు సినిమాలు లైన్‌లో పెట్టాడు. తనకు ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురామ్‌తో ఓ సినిమా చేస్తుండగా… ‘జెర్సీ’ లాంటి అదిరిపోయే సినిమా చేసిన గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమా అయిన ‘రాజా వారు రాణి గారు’ దర్శకుడు రవికిరణ్ కోలాతో ఓ సినిమా చేస్తున్నాడు. తొలి, మూడో సినిమాను దిల్ రాజే నిర్మిస్తున్నారు.
పరశురామ్ సినిమాకు ఇప్పటికే టైటిల్ దాదాపు ఫిక్స్ అయిపోగా… ఇప్పుడు రవికిరణ్ సినిమాకు పేరును ఫిక్స్ చేశారు అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. ఈ సినిమాకు ‘యుద్ధం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. 80వ దశకం నేపధ్యంలో మాఫియా యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందట. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమాలో (Vijay) విజయ్ సరికొత్తగా ఉంటాడట.
త్వరలో ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటిస్తారని సమాచారం. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఇటీవల మాఫియా, గ్యాంగ్‌స్టర్ నేపథ్య సినిమాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. భారీ విజయాలు, అతి భారీ వసూళ్లు వస్తున్నాయి ఆ సినిమాలకు. అందుకే విజయ్ ఇలాంటి సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యే ఆలోచనలో ఉన్నాడట. మరి ఎలా, ఏంటి అనేది చూడాలి.