కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్ ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్ర నిర్మాత ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ సినిమాకు ఊహించని విధంగా లాభాలు రావడం విశేషం.
ఈ సినిమాకు ఇలా అత్యధికంగా లాభాలు రావడంతో (Producers) నిర్మాత కళానిధి మారన్ హీరో రజనీకాంత్ తో పాటు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్లకు అదనంగా రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాకుండా ఖరీదైన కార్లను కూడా వారికి కానుకగా అందజేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా నిర్మాత కళానిధి మారతాన్ గొప్ప మనసు చాటుకున్నారు. జైలర్ సినిమా ద్వారా ఆయన లాభాలు పొందడంతో కొంత అమౌంట్ ను సేవా కార్యక్రమాలకు కూడా వినియోగించారు.
దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అపోలో హాస్పిటల్స్ కి ఈయన ఏకంగా కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ డబ్బు ద్వారా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ నిర్వహించడం కోసం ఈ కోటి రూపాయల చెక్కును సన్ పిక్చర్స్ తరఫున శ్రీమతి కావేరి కళానిధి అపోలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సి ప్రతాపరెడ్డి చేతికి అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా చిన్నారుల గుండె ఆపరేషన్ కోసం సన్ పిక్చర్స్ వారు ఈ విధంగా కోటి రూపాయల చెక్ అందించడంతో ఈ విషయాన్ని ప్రతాపరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ విషయం తెలిసి నేటిజన్స్ సైతం నిర్మాతపై ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు.ఇలా సినిమాలలో వచ్చినటువంటి లాభాలు ప్రజాసేవ కోసం ఉపయోగించడం మంచి నిర్ణయం అంటూ కామెంట్ చేస్తున్నారు.