కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘K-Ramp‘. జెయిన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాజేష్ దండా నిర్మించారు. యుక్తి తరేజా హీరోయిన్.అక్టోబర్ 18న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. `K-RAMP`టీజర్, ట్రైలర్స్ వంటివి ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కానీ ‘క’ సెంటిమెంట్ తో సినిమాకు మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీపావళికి రిలీజ్ అయిన సినిమాల్లో ‘K-RAMP’ కి బెటర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి.దీపావళి హాలిడేస్ ఈ సినిమాకి బాగానే కలిసొచ్చాయి. మరోవైపు నిర్మాత కాంట్రోవర్సీ కూడా సినిమా పబ్లిసిటీకి బాగా కలిసి వస్తుంది అని చెప్పాలి.
ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.35 cr |
సీడెడ్ | 0.95 cr |
ఆంధ్ర(టోటల్) | 2.78 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 6.08 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.74 cr |
ఓవర్సీస్ | 0.88 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 7.7 కోట్లు(షేర్) |
‘K-Ramp‘ సినిమాకి రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.7.7 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.13.45 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.20 కోట్లు ప్రాఫిట్స్ తో రన్ కొనసాగిస్తుంది.