రీసెంట్ గా కాజల్ అగర్వాల్ తన చెల్లెలి కుమారుడితో ఓ యాడ్ లో నటించారు. అందులో కాజల్ బేబీ బంప్ తో కనిపించింది. అయితే చాలా మంది ఆమె ఫిజిక్ గురించి కామెంట్స్ చేశారు. చాలా లావుగా ఉన్నావని.. అసలు నీకేమైందంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. సాధారణంగా అయితే కాజల్ ఇలాంటి విమర్శలను పట్టించుకోదు కానీ ఆమె గర్భవతి అని తెలిసి కూడా జనాలు అలా మాట్లాడడం ఆమె తట్టుకోలేకపోయింది. దీంతో తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి ఘాటు సమాధానమిచ్చింది.
ప్రస్తుతం తన జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని.. ఇలాంటి సమయంలో నెగెటివ్ ట్రోలింగ్, బాడీ షేమింగ్ మెసేజ్ లు, మీమ్స్ తనకు ఏ విధంగా హెల్ప్ చేయలేవని.. అందరం దయతో ఉండడం నేర్చుకుందామని తెలిపింది. ఒకవేళ ఇతరుల విషయంలో మీరు కేరింగ్ గా ఉండలేకపోతే.. మీరు బతకండి.. వాళ్ల బతుకు వాళ్లను బతకనివ్వండి అంటూ మండిపడింది. గర్భధారణ సమయంలో ఆడవాళ్లు బరువు పెరుగుతారని.. శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని కాజల్ చెప్పుకొచ్చింది.
కడుపులో బిడ్డ పెరిగేకొద్దీ పొట్ట, బ్రెస్ట్ పెరుగుతుందని.. శిశువుకి తగినట్లుగా శరీరం సిద్ధమవుతుందని తెలిపింది. దీనికారణంగా చాలా మందికి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయని.. కొన్ని సార్లు చర్మం చిట్లిపోతుందని.. బాడీ అలసిపోతుందని రాసుకొచ్చింది. ప్రతికూల ఆలోచనలు, నెగెటివ్ థింకింగ్ వలన అనారోగ్య పాలవుతామని.. అది మన శరీరానికి బిడ్డకు మంచిది కాదని ప్రెగ్నెంట్ లేడీస్ కి సూచించింది. మునుపతి స్థితికి శరీరం రావడానికి కొంత సమయం పట్టొచ్చు.. ఒకవేలమా రాకపోయినా పర్లేదు.. ఈ మార్పులు చాలా సహజమైనవి అంటూ చెప్పుకొచ్చింది. చిన్నారికి జన్మనివ్వడమనేది ఒక సెలబ్రేషన్ అని కాజల్ ఎమోషనల్ గా రాసుకొచ్చింది.